సింహాచలం గిరి ప్రదక్షిణ: విశాఖలో ట్రాఫిక్ ఆంక్షలు – ఈ రూట్లను తప్పించండి

సింహాచలం గిరి ప్రదక్షిణ సందర్భంగా ట్రాఫిక్ ఆంక్షలు – రేపు సాయంత్రం 5 గంటల వరకు అమల్లో

సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనృసింహ స్వామి గిరి ప్రదక్షిణ మహోత్సవం సందర్భంగా విశాఖపట్నం నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు నగర పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చీ ప్రకటించారు.
ఈ ఆంక్షలు ఈ రోజు ఉదయం 6 గంటల నుంచి రేపు (గురువారం) సాయంత్రం 5 గంటల వరకు అమల్లో ఉంటాయని తెలిపారు.

 ప్రధాన ట్రాఫిక్ మార్పులు:

  • అడివివరం నుంచి గోపాలపట్నం పెట్రోల్ బంక్ వరకు వాహనాలకు ప్రవేశం లేదు

  • భక్తుల వాహనాల కోసం ప్రత్యేక పార్కింగ్ స్థలాల ఏర్పాటు

  • నగరంలోకి భారీ వాహనాల రాకపోకలపై నిషేధం

  • ప్రజలు సహకరించాలని పోలీస్ శాఖ విజ్ఞప్తి

భక్తులకు సూచనలు:

  • అడివివరం వైపు నుంచి వచ్చే భక్తులు తమ వాహనాలను అడివివరం కూడలి వద్ద పార్క్ చేసి కాలినడకన ప్రదక్షిణ మార్గంలోకి వెళ్లాలి.

  • వేపగుంట, గోపాలపట్నం వైపు నుంచి వచ్చే భక్తులు తమ వాహనాలను సింహపురం కాలనీ వద్ద ఏర్పాటు చేసిన పార్కింగ్ ప్రాంగణాల్లో నిలపాలి.

 ప్రత్యామ్నాయ మార్గాలు & ఆంక్షలు:

  • సత్తరువు జంక్షన్ నుంచి అడివివరం వైపునకు మాత్రమే వాహనాలకు అనుమతి ఉంటుంది.
    అక్కడి నుంచి హనుమంతవాక వైపు ప్రయాణం చేయలేరు.

  • గోపాలపట్నం పెట్రోల్ బంక్ నుంచి పాత గోశాల కూడలి వైపు వాహనాలకు ప్రవేశం లేదు.

భారీ వాహనాల రాకపోకలపై ఆంక్షలు:

  • పెందుర్తి, NAD కూడళ్ల నుంచి గోపాలపట్నం వైపు భారీ వాహనాలను అనుమతించరు.

  • అనకాపల్లి నుంచి నగరంలోకి వచ్చే భారీ వాహనాలను లంకెలపాలెం వద్ద సబ్బవరం వైపు మళ్లిస్తున్నారు.

పోలీసులు ప్రయాణికులు తమ ప్రయాణాలను ముందుగానే ప్లాన్ చేసుకోవాలని సూచించారు. పోలీసు ఆదేశాలు పాటించి సహకరించాలని కోరుతున్నారు.


Today's Best Deals

Rs. 270.00

Emoji Expressions Matching Game

Rs. 480.00

Labubu Bunny Keychain

Rs. 100.00

Face Changing Keychain

Rs. 230.00

Busy Book