హెన్లీ పాస్‌పోర్ట్ ఇండెక్స్ 2025 విడుదల – భారత్‌కు 77వ స్థానం
హెన్లీ పాస్‌పోర్ట్ ఇండెక్స్ 2025 విడుదలైంది. ఈసారి సింగపూర్ అగ్రస్థానంలో నిలిచి, మొత్తం 193 దేశాలకు వీసా లేకుండా ప్రయాణించే అవకాశం కల్పిస్తున్న పాస్‌పోర్ట్‌గా గుర్తింపు పొందింది.
భారత్ పాస్‌పోర్ట్ శక్తి కొంత మెరుగైంది, గత సంవత్సరం 80వ స్థానంలో ఉండగా, ఇప్పుడు 77వ స్థానానికి చేరుకుంది. వీసా లేకుండా లేదా అక్కడికి వెళ్లిన తర్వాత వీసా ఇచ్చే దేశాల సంఖ్య ఆధారంగా ఈ ర్యాంకింగ్‌ను నిర్ణయిస్తారు. ప్రస్తుతం భారత పాస్‌పోర్టుతో 59 దేశాలకు మాత్రమే వీసా లేకుండా ప్రయాణించవచ్చు, ఇది గత సంవత్సరం 62గా ఉండేది.
మలేషియా, ఇండోనేషియా, మాల్దీవులు, థాయ్‌లాండ్ వంటి దేశాలు భారతీయులకు వీసా రహిత ప్రయాణాలు అనుమతిస్తున్నాయి. శ్రీలంక, మకావు, మయన్మార్ వంటి దేశాలు అక్కడికి చేరిన తర్వాత వీసా మంజూరు చేస్తున్నాయి. ఈ జాబితాలో ఆఫ్ఘనిస్థాన్ చివరిస్థానంలో ఉంది, ఆ దేశ పాస్‌పోర్టుతో కేవలం 25 దేశాలకు మాత్రమే వీసా లేకుండా వెళ్లే అవకాశం ఉంది.