ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (ఈపీఎఫ్ఓ) ఇప్పుడు డిజిలాకర్ యాప్ ద్వారా తన సేవలను అందిస్తోంది. ఇకపై ఖాతాదారులు డిజిలాకర్‌ను ఉపయోగించి తమ పీఎఫ్ బ్యాలెన్స్ చెక్ చేయడం, పాస్‌బుక్ డౌన్‌లోడ్ చేసుకోవడం సులభంగా చేయవచ్చు. ఈపీఎఫ్ఓ ఈ కొత్త ఫీచర్‌ను సోషల్ మీడియాలో ప్రకటించింది. దీని ద్వారా ఎక్కడి నుంచైనా పీఎఫ్ డాక్యుమెంట్లను యాక్సెస్ చేయొచ్చు.
ఆండ్రాయిడ్ మొబైల్ వినియోగదారులు డిజిలాకర్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసి లాగిన్ అయి ఈ సేవలను పొందవచ్చు. పీఎఫ్ బ్యాలెన్స్, పాస్‌బుక్‌తో పాటు యూఏఎన్ కార్డు, పెన్షన్ పేమెంట్ ఆర్డర్ (PPO), స్కీమ్ సర్టిఫికేట్ వంటి డాక్యుమెంట్లను కూడా డౌన్‌లోడ్ చేయవచ్చు. ఇప్పటివరకు ఈ ఫీచర్ ఉమాంగ్ యాప్‌లో మాత్రమే ఉండేది. ఇప్పుడు డిజిలాకర్‌లో కూడా అందుబాటులోకి వచ్చింది.
ప్రస్తుతం ఈ సేవలు కేవలం ఆండ్రాయిడ్ యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. త్వరలోనే ఐఓఎస్ యూజర్లకూ ఈ ఫీచర్ అందుబాటులోకి రానుంది. ఉమాంగ్ యాప్ మరియు ఈపీఎఫ్ఓ అధికారిక వెబ్‌సైట్‌ల్లో కూడా ఈ సేవలు లభిస్తున్నాయి. రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ నుంచి 99660 44425 నంబర్‌కు మిస్డ్ కాల్ ఇచ్చి కూడా పీఎఫ్ బ్యాలెన్స్ తెలుసుకోవచ్చు.
డిజిలాకర్‌లో ఈపీఎఫ్ఓ సేవలు ప్రారంభం