EPFO: పీఎఫ్ డబ్బులు ఇక ఏటీఎం నుంచి ఉపాధ్యాయులకు సులభ సౌకర్యం

కోట్లాది మంది EPFO ఖాతాదారులకు ఒక శుభవార్త. అత్యవసర పరిస్థితుల్లో పీఎఫ్ ఖాతా నుంచి నగదు తీసుకోవడం మరింత సులభం అయ్యే విధంగా కేంద్ర ప్రభుత్వం సిద్దమైంది. వచ్చే ఏడాది జనవరి నుంచి, ఉద్యోగులు ఏటీఎంల ద్వారా నేరుగా తమ PF ఫండ్స్‌ను విత్‌డ్రా చేసుకోవచ్చు.

ఈ అంశంపై తుది నిర్ణయం ఈపీఎఫ్ఓ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ అక్టోబర్ రెండో వారంలో సమావేశంలో తీసుకోనుంది. ఆ తర్వాత కొత్త సేవలు ప్రారంభించడానికి మార్గం సుగమం అవుతుంది. EPFO ప్రత్యేక ATM డెబిట్ కార్డ్ ను చందాదారులకు జారీ చేస్తుంది. ఈ కార్డు ఉపయోగించి ఉద్యోగులు ఎలాంటి పత్రాలు సమర్పించకుండానే నగదు పొందగలుగుతారు.

ప్రస్తుతం ఈపీఎఫ్ఓలో 7.8 కోట్ల మంది ఖాతాదారులు ఉన్నారు, వారి ఖాతాల్లో సుమారు ₹28 లక్షల కోట్లు జమై ఉన్నాయి. కొత్త ATM సౌకర్యం అమలులోకి వచ్చిన తర్వాత, అత్యవసర పరిస్థితుల్లో PF నగదు పొందడం చాలా సులభం అవుతుంది.


Today's Best Deals

Rs. 270.00

Emoji Expressions Matching Game

Rs. 480.00

Labubu Bunny Keychain

Rs. 100.00

Face Changing Keychain

Rs. 230.00

Busy Book