ఎంవీ కృష్ణారెడ్డి: డీఎస్సీ మైనర్ మీడియం పరీక్షల ప్రాథమిక కీ ఈరోజు విడుదల

డీఎస్సీ సోషల్ స్టడీస్ పరీక్షకు 95.11% హాజరు
కన్నడ, ఒడియా, తమిళం, ఉర్దూ పరీక్షల కీ నేటి నుంచి విడుదల

మెగా డీఎస్సీ 2024 పరీక్షలలో భాగంగా స్కూల్ అసిస్టెంట్ (నాన్ లాంగ్వేజ్) సోషల్ స్టడీస్ పరీక్ష ఇటీవల నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా 38,243 మంది దరఖాస్తు చేసుకోగా, 36,372 మంది పరీక్షకు హాజరయ్యారు, ఇది 95.11 శాతం హాజరు అని కన్వీనర్ ఎం.వి. కృష్ణారెడ్డి తెలిపారు. ఈ పరీక్ష 227 కేంద్రాల్లో నిర్వహించారు.

ఉదయం అనంతపురం జిల్లాలో 97.84%, మధ్యాహ్నం చిత్తూరు జిల్లాలో 97.98% హాజరుతో అత్యధిక హాజరు నమోదయ్యిందని ఆయన పేర్కొన్నారు.

మైనార్ మీడియం లాంగ్వేజ్ పరీక్షల ప్రాథమిక కీ విడుదల

కన్నడ, ఒడియా, తమిళం, ఉర్దూ భాషలలో స్కూల్ అసిస్టెంట్ (లాంగ్వేజెస్) పరీక్షల ప్రాథమిక కీని నేటి నుంచి అధికారిక వెబ్‌సైట్ https://apdsc.apcfss.in లో అందుబాటులో ఉంచినట్లు కన్వీనర్ తెలిపారు. అభ్యర్థులు లాగిన్‌ ద్వారా తమ రెస్పాన్స్ షీట్, కీ చూడవచ్చు.

ప్రాథమిక కీపై అభ్యంతరాలు ఉంటే, అభ్యర్థులు తగిన ఆధారాలతో జూన్ 23లోపు వెబ్‌సైట్‌ ద్వారా ఆన్‌లైన్‌లో తెలియజేయాలని ఆయన సూచించారు.


Today's Best Deals

Rs. 270.00

Emoji Expressions Matching Game

Rs. 480.00

Labubu Bunny Keychain

Rs. 100.00

Face Changing Keychain

Rs. 230.00

Busy Book