బీఎస్‌ఎన్‌ఎల్ కొత్త ఫ్రీడమ్ ప్లాన్ కేవలం రూ.1కి – వినిపించినా నమ్మలేరు!

రూపాయికే నెల రోజుల బంపర్ ప్లాన్ – బీఎస్‌ఎన్‌ఎల్ ఫ్రీడమ్ ఆఫర్

ప్రభుత్వ రంగ సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్ వినియోగదారులను ఆకట్టుకునేందుకు కొత్త ప్లాన్‌ను విడుదల చేసింది. "ఫ్రీడమ్ ప్లాన్" పేరిట విడుదలైన ఈ ఆఫర్‌ కేవలం రూ.1కే నెల రోజుల పాటు అన్‌లిమిటెడ్ కాలింగ్, రోజుకు 2GB డేటా, ఉచిత 4G సిమ్ లను అందిస్తోంది. ఈ ప్లాన్ కొత్త కస్టమర్లకు మాత్రమే వర్తిస్తుంది.

ఈ పరిమితకాల ఆఫర్‌ను ఆగస్టు 1 నుంచి 31 వరకు దేశవ్యాప్తంగా అందుబాటులో ఉంచారు. కొత్త కనెక్షన్ తీసుకోవాలనుకునే వారు తమ సమీప బీఎస్‌ఎన్‌ఎల్ ఔట్‌లెట్‌కు వెళ్లి రూ.1 చెల్లించి ప్లాన్ యాక్టివేట్ చేసుకోవాలి. ప్లాన్ వాలిడిటీ 30 రోజులు మాత్రమే ఉంటుంది.

ఇప్పటికే బీఎస్‌ఎన్‌ఎల్ సేవలు ఉపయోగిస్తున్నవారికి లేదా ఇతర నెట్‌వర్క్ నుంచి పోర్ట్ అవ్వాలనుకునే వారికి ఈ ఆఫర్ వర్తించదు. 30 రోజుల తర్వాత సేవలు కొనసాగించాలంటే రూ.147 రెగ్యులర్ ప్లాన్తో రీచార్జ్ చేయాలి. బీఎస్‌ఎన్‌ఎల్ ముఖ్యంగా టైర్-2, టైర్-3 నగరాల్లో తన నెట్‌వర్క్‌ను బలోపేతం చేయడమే లక్ష్యంగా ఈ ప్రచారాన్ని ప్రారంభించింది.


Today's Best Deals

Rs. 270.00

Emoji Expressions Matching Game

Rs. 480.00

Labubu Bunny Keychain

Rs. 100.00

Face Changing Keychain

Rs. 230.00

Busy Book