ఆజాదీ కా ప్లాన్‌ను సెప్టెంబర్ 15 వరకు పొడిగించిన బీఎస్ఎన్ఎల్
ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ (BSNL) తన వినియోగదారుల కోసం ప్రత్యేకంగా ప్రారంభించిన రూ.1కే ఆజాదీ కా ప్లాన్ గడువును సెప్టెంబర్ 15 వరకు పొడిగించింది. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆగస్టులో ఈ ప్లాన్‌ను లాంచ్ చేసిన బీఎస్ఎన్ఎల్‌కు, వినియోగదారుల నుంచి విపరీతమైన స్పందన వచ్చింది.
ఆజాదీ కా ప్లాన్ ఆఫర్లు:
- కేవలం ₹1కే 30 రోజుల పాటు
- అపరిమిత వాయిస్ కాల్స్
- రోజుకు 2GB డేటా
- రోజుకు 100 SMSలు
- ఉచిత 4G సిమ్
ఈ ప్రత్యేక ఆఫర్ ఆగస్టు 31తో ముగియాల్సి ఉండగా, వినియోగదారుల డిమాండ్ కారణంగా బీఎస్ఎన్ఎల్ దానిని సెప్టెంబర్ 15 వరకు పొడిగించింది.
బీఎస్ఎన్ఎల్ సీఎండీ ఎ. రాబర్ట్ జె. రవి మాట్లాడుతూ:
“మేక్ ఇన్ ఇండియా కింద దేశవ్యాప్తంగా ఆధునిక 4జీ నెట్‌వర్క్‌ను ప్రారంభించాం. ఈ ఆఫర్ ద్వారా వినియోగదారులు తక్కువ ఖర్చుతో కొత్త 4జీ సర్వీసులను పొందగలుగుతున్నారు” అన్నారు.
ఈ ప్లాన్‌ను పొందాలంటే సమీప BSNL కస్టమర్ సర్వీస్ సెంటర్ (CSC) లేదా అధికారిక రిటైలర్‌ను సంప్రదించవచ్చు.
మరిన్ని వివరాల కోసం 1800-180-1503కు కాల్ చేయండి లేదా www.bsnl.co.inను సందర్శించండి.