అమెజాన్ ప్రైమ్ డే సేల్ తేదీలను ప్రకటించింది

అమెజాన్ ప్రకటించిన మరో బంపర్ ఆఫర్: జూలై 12 నుంచి 14 వరకూ ప్రైమ్ డే సేల్

అమెజాన్ తన వినియోగదారుల కోసం మరోసారి భారీ ఆఫర్‌ను ప్రకటించింది. ప్రతి సంవత్సరం జరిగేలా ఈ ఏడాది కూడా ప్రైమ్ డే 2025 సేల్ ఈవెంట్ జరగనుంది. ఈ సేల్ జూలై 12 నుంచి 14 వరకు మూడు రోజుల పాటు జరగనున్నట్లు అమెజాన్ అధికారికంగా తెలిపింది.

ఈ ప్రత్యేక సేల్ ప్రైమ్ సభ్యులకు మాత్రమే వర్తిస్తుంది మరియు 124 దేశాల్లో అందుబాటులో ఉంటుంది. సోనీ, డైసన్, కీహ్ల్స్, లెవీస్, శాంసంగ్ వంటి ప్రముఖ బ్రాండ్లపై భారీ డిస్కౌంట్లు లభించనున్నాయి. ఎలక్ట్రానిక్స్, కిచెన్, బ్యూటీ, డ్రెస్‌లు, స్కూల్ సప్లైస్, హోమ్ ఇంప్రూవ్‌మెంట్, టాయ్స్ సహా 35కిపైగా విభాగాల్లో మిలియన్ల డీల్స్ అందుబాటులో ఉంటాయని సంస్థ తెలిపింది.

"టు డేస్ బిగ్ డీల్స్" పేరుతో ప్రతి రోజూ అర్ధరాత్రి నుంచి ప్రైమ్ సభ్యులకు ప్రత్యేక డిస్కౌంట్లు లభిస్తాయి. పాఠశాల సామగ్రిపై 40% వరకు, అమెజాన్ బ్రాండ్లపై 30% వరకు తగ్గింపు ఉంటుంది. భారతదేశంలో ప్రైమ్ సభ్యులకు పది లక్షల కంటే ఎక్కువ ఉత్పత్తులపై అదే రోజు ఉచిత డెలివరీ, 40 లక్షల ఉత్పత్తులపై తదుపరి రోజు డెలివరీ, మరియు 20 వేలకు పైగా ఉత్పత్తులపై 4 గంటల్లో డెలివరీ అందుబాటులో ఉంటుందని అమెజాన్ పేర్కొంది. గత సంవత్సరం ప్రైమ్ డే సందర్భంగా దేశవ్యాప్తంగా 200 మిలియన్ ఉత్పత్తులు అమ్ముడయ్యాయని, చిన్న వ్యాపారాలు నిమిషానికి 1600 యూనిట్లు విక్రయించాయనీ వెల్లడించింది.


Today's Best Deals

Rs. 270.00

Emoji Expressions Matching Game

Rs. 480.00

Labubu Bunny Keychain

Rs. 100.00

Face Changing Keychain

Rs. 230.00

Busy Book