18 రోజుల్లో అమర్‌నాథ్ యాత్రలో 3 లక్షలకుపైగా భక్తులు దర్శనం

అమర్‌నాథ్ యాత్ర: ఇప్పటివరకు 3.07 లక్షల మంది భక్తుల దర్శనం

ఈ సంవత్సరం అమర్‌నాథ్ యాత్రలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొంటున్నారు. జూలై 3న యాత్ర ప్రారంభమై, ఆగస్టు 9న ముగియనుంది. కేవలం 18 రోజుల్లోనే 3.07 లక్షల మందికిపైగా భక్తులు హిమాలయాల్లో ఉన్న మంచు శివలింగాన్ని దర్శించారు. మిగిలిన రోజుల్లో మొత్తం 3.5 లక్షల మందికి పైగా భక్తులు దర్శనం చేసే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.

ఆదివారంజమ్మూలోని భగవతి నగర్ యాత్రి నివాస్ నుంచి 3,791 మంది యాత్రికులు రెండు ఎస్కార్ట్ కాన్వాయ్‌ల్లో లోయ వైపు వెళ్లారు. ఇందులో మొదటి కాన్వాయ్ తెల్లవారుజామున 3:33 గంటలకు బాల్టాల్ బేస్ క్యాంప్కు 52 వాహనాలతో 1,208 మంది భక్తులతో బయలుదేరింది. రెండవ కాన్వాయ్ 4:06 గంటలకు పహల్గామ్ బేస్ క్యాంప్కు 96 వాహనాల్లో 2,583 మంది భక్తులతో బయలుదేరింది.

శ్రీ అమర్‌నాథ్ శ్రైన్ బోర్డు (SASB) ఛైర్మన్, జమ్మూ కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ఆదివారం బాల్టాల్ బేస్ క్యాంప్ను సందర్శించారు. యాత్ర సజావుగా సాగేందుకు చేసిన ఏర్పాట్లను సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన అధికారులతో సమావేశమై, కమ్యూనిటీ కిచెన్లో భక్తులతో కలిసి భోజనం చేశారు. భక్తులతో మాట్లాడారు కూడా. ఈ యాత్ర కోసం ప్రభుత్వం బలమైన భద్రతా ఏర్పాట్లు చేసింది.


Today's Best Deals

Rs. 270.00

Emoji Expressions Matching Game

Rs. 480.00

Labubu Bunny Keychain

Rs. 100.00

Face Changing Keychain

Rs. 230.00

Busy Book