అమర్‌నాథ్ యాత్రకు ఏర్పాట్లు పూర్తి – యాత్రికుల భద్రత కోసం ‘ఆపరేషన్ శివ’ ప్రారంభం

అమర్‌నాథ్ యాత్రలో పాల్గొనే యాత్రికుల భద్రత కోసం జమ్మూ కశ్మీర్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జూలై 1 నుంచి ఆగస్టు 10 వరకు అమర్‌నాథ్ యాత్ర మార్గాల్లో నో-ఫ్లై జోన్ అమలు చేయనున్నారు. ఈ కాలంలో డ్రోన్లు, బెలూన్లు, ఇతర విమాన సామగ్రిని వినియోగించరాదు. యాత్రలో పాల్గొనే భక్తుల రక్షణ కోసం కేంద్ర పాలిత ప్రాంత హోం శాఖ ఈ ఆదేశాలు జారీ చేసింది.

ఈ సంవత్సరం యాత్ర జూలై 3న ప్రారంభమై ఆగస్టు 8న ముగియనుంది. ఇటీవల ఉగ్రవాద ముప్పు నేపథ్యంలో ఇది చాలా కీలక యాత్రగా మారింది. ఏప్రిల్ 22న పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడి, మేలో భారత్-పాకిస్థాన్ మధ్య ఘర్షణలు వల్ల పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. అందుకే నో-ఫ్లై జోన్ విధించామని అధికారులు తెలిపారు.

యాత్రికుల రక్షణ కోసం 50,000 మందికిపైగా భద్రతా సిబ్బందిని మోహరించారు. ఆపరేషన్ శివ పేరిట రోడ్ ఓపెనింగ్, ఐఈడీ చెకింగ్, బాంబ్ స్క్వాడ్‌లతో చర్యలు చేపడుతున్నారు. మొదటిసారి జామర్లు కూడా కాన్వాయ్‌కు రక్షణగా ఉపయోగించనున్నారు. ఈ చర్యలతో హిమాలయ పుణ్యక్షేత్రానికి వచ్చే భక్తులకు సంపూర్ణ భద్రతను అందిస్తామనే నమ్మకం అధికారులు వ్యక్తం చేస్తున్నారు.


Today's Best Deals

Rs. 270.00

Emoji Expressions Matching Game

Rs. 480.00

Labubu Bunny Keychain

Rs. 100.00

Face Changing Keychain

Rs. 230.00

Busy Book