Andhra Pradesh

ఏపీలో తగ్గనున్న విద్యుత్ భారం: ఈ నెల నుంచే కరెంట్ బిల్లుల తగ్గింపు

రాష్ట్రంలోని విద్యుత్ వినియోగదారులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త అందించింది. ఈ నెల నుంచే ఎఫ్‌పీపీ (ఇంధన, విద్యుత్ కొనుగోలు సర్దుబాటు) ఛార్జీని యూనిట్‌కు 40 పైసల నుంచి 13 పైసలకు తగ్గిస్తున్నట్లు ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. గత ప్రభుత్వం అధిక ఛార్జీలు విధించి పేద, మధ్యతరగతి కుటుంబాలపై భారీ భారం మోపిందని ఆయన విమర్శించారు.

అనకాపల్లి జిల్లా మాడుగుల నియోజకవర్గంలోని చౌడువాడ, కింతలి గ్రామాల్లో కొత్తగా నిర్మించిన విద్యుత్ ఉపకేంద్రాలను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో ఎఫ్‌పీపీ ఛార్జీల రూపంలో అధికంగా వసూలు చేశారని, ప్రస్తుతం ఛార్జీలను గణనీయంగా తగ్గించడం ద్వారా వినియోగదారులకు ఆర్థిక ఉపశమనం కలుగుతుందని తెలిపారు.

రాష్ట్రంలో విద్యుత్ మౌలిక వసతులను బలోపేతం చేస్తూ ప్రభుత్వం కీలక చర్యలు తీసుకుంటోందని మంత్రి చెప్పారు. ఇందులో భాగంగా 11 జిల్లాల్లో ₹250 కోట్ల వ్యయంతో 69 కొత్త సబ్ స్టేషన్లు నిర్మిస్తున్నట్లు వెల్లడించారు. అలాగే రాష్ట్రంలోని 20 వేల ఎస్సీ, ఎస్టీ లబ్ధిదారుల ఇళ్లపై ఉచితంగా సోలార్ పవర్ యూనిట్లు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.

అదే సమయంలో ఇటీవల విద్యుదాఘాతానికి గురై మరణించిన ఇద్దరు కుటుంబాలకు మంత్రి గొట్టిపాటి సానుభూతి తెలియజేశారు. ప్రభుత్వం తరఫున వారికి ₹5 లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందజేశారు.


Today's Best Deals

Rs. 270.00

Emoji Expressions Matching Game

Rs. 480.00

Labubu Bunny Keychain

Rs. 100.00

Face Changing Keychain

Rs. 230.00

Busy Book