హైదరాబాద్: అమెరికా యూఎస్ ఎంబసీ భారతీయులకి కీలక హెచ్చరిక ఇచ్చింది. అక్రమంగా అమెరికాలోకి వెళ్లే ప్రయత్నాలు చేస్తే నిర్బంధం, డిపోర్ట్, ఇంకా శాశ్వత వీసా నిషేధం ఎదురవుతుందని స్పష్టంగా తెలిపింది.
ఎంబసీ ప్రకారం, అక్రమ మార్గాల్లో వెళ్లే వాళ్లు జైలు శిక్ష లేదా బలవంతంగా దేశానికి తిరిగి పంపించే అవకాశం ఉందని తెలిపింది. ఎంత ఖర్చు పెట్టినా, ఈ రకమైన ప్రయాణాలు జీవితకాల దెబ్బ అవుతాయని హెచ్చరించింది.
వీసా అనేది హక్కు కాదు – ఇది ఒక ప్రివిలేజ్ మాత్రమే. వీసా ఇచ్చిన తర్వాత కూడా ప్రయాణికులపై నిఘా కొనసాగుతుంది. ఎవరో చట్టాన్ని ఉల్లంఘిస్తే వారి వీసా తక్షణమే రద్దు చేయవచ్చు.
స్టూడెంట్ వీసా లేదా టూరిస్ట్ వీసా పై వెళ్లే వారు చాలా జాగ్రత్తగా ఉండాలని ఎంబసీ సూచించింది. మాదకద్రవ్యాలు వాడటం, అమెరికా చట్టాలను ఉల్లంఘించడం వల్ల భవిష్యత్తులో వీసా పొందే అర్హతను శాశ్వతంగా కోల్పోతారు.