అమెరికా వీసా: భారతీయులకు కీలక వెసులుబాటు రద్దు – కొత్త నిబంధనలతో కఠినతరం

అమెరికా వీసా నిబంధనల్లో కీలక మార్పులు – భారతీయులకు పెద్ద దెబ్బ

  • ఇకపై నాన్-ఇమ్మిగ్రెంట్ వీసాల కోసం తమ సొంత దేశంలోనే లేదా చట్టబద్ధంగా నివసిస్తున్న దేశంలోనే ఇంటర్వ్యూ అపాయింట్‌మెంట్ తప్పనిసరి
  • మూడో దేశంలో వీసా ఇంటర్వ్యూ చేయించుకునే వెసులుబాటు రద్దు
  • కరోనా సమయంలో ఇచ్చిన ప్రత్యేక సడలింపుకు ముగింపు
  • భారతీయ పర్యాటకులు, విద్యార్థులు, వ్యాపారులుపై తీవ్ర ప్రభావం

అమెరికా ప్రభుత్వం నాన్-ఇమ్మిగ్రెంట్ వీసాల జారీ విధానంలో కొత్త మార్పులు చేసింది. తాజా నియమాల ప్రకారం, వీసా కోసం దరఖాస్తు చేసుకున్నవారు తప్పనిసరిగా తమ దేశంలోనే లేదా చట్టబద్ధంగా నివసిస్తున్న దేశంలోనే ఇంటర్వ్యూకు హాజరుకావాలి. ఇతర దేశాల్లో ఇంటర్వ్యూలు పూర్తి చేసుకునే అవకాశం ఇకపై ఉండదు.

కరోనా సమయంలో భారత్‌లో అపాయింట్‌మెంట్‌లు ఎక్కువగా పెరగడంతో అనేక మంది దుబాయ్, బ్యాంకాక్ వంటి దేశాల్లో వీసా ఇంటర్వ్యూలు పూర్తి చేసుకున్నారు. ఆ సౌలభ్యాన్ని అమెరికా ప్రభుత్వం ఇప్పుడు రద్దు చేసింది.

ఈ కొత్త మార్పులు పర్యాటక (B2), వ్యాపార (B1), విద్య (F-1), తాత్కాలిక ఉద్యోగ వీసాలకు (H, L వీసాలు) దరఖాస్తు చేసుకునే వారిపై ప్రభావం చూపనున్నాయి. ముఖ్యంగా అత్యవసర ప్రయాణాల కోసం వీసా పొందాలని అనుకునే వారికి సమస్యలు తలెత్తనున్నాయి.

నిపుణులు చెబుతున్నదాని ప్రకారం, అమెరికా వెళ్లే ప్రణాళికలు చేసుకునే వారు ముందుగానే అపాయింట్‌మెంట్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. లేదంటే వీసా ఆలస్యంతో ఇతర దేశాలను ప్రత్యామ్నాయంగా ఎంచుకునే పరిస్థితి రావచ్చని హెచ్చరిస్తున్నారు.


Today's Best Deals

Rs. 270.00

Emoji Expressions Matching Game

Rs. 480.00

Labubu Bunny Keychain

Rs. 100.00

Face Changing Keychain

Rs. 230.00

Busy Book