TS EAPCET 2025 కౌన్సెలింగ్ త్వరలో ప్రారంభం – హెల్ప్‌లైన్ వివరాలు, పీఈసెట్ ఫలితాలు

TS EAPCET 2025 కౌన్సెలింగ్: ఈఏపీసెట్‌, ఈసెట్‌, ఐసెట్ కౌన్సెలింగ్‌పై సందేహాలా? ఈ నంబర్లకు కాల్ చేయండి!

హైదరాబాద్, జూన్ 18: 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించిన TS EAPCET, ECET, ICET కౌన్సెలింగ్ ప్రక్రియలు త్వరలో ప్రారంభం కానున్నాయి. ముఖ్యంగా TS EAPCET 2025 కౌన్సెలింగ్ షెడ్యూల్ కోసం విద్యార్థులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఉన్నత విద్యామండలి చైర్మన్ వి. బాలకృష్ణా రెడ్డి ప్రకారం, కౌన్సెలింగ్ జూలై మొదటి లేదా రెండవ వారంలో ప్రారంభం అయ్యే అవకాశం ఉంది. విద్యార్థుల సందేహాలను తొలగించేందుకు తెలంగాణ ఉన్నత విద్యామండలి హెల్ప్‌లైన్ కేంద్రం ప్రారంభించింది.

హెల్ప్‌లైన్ సమాచారం:
ఫోన్ నంబర్లు: 7660009768, 7660009769
ఇమెయిల్: tgcets.telangana@gmail.com
సమయం: ఉదయం 9:30 నుంచి సాయంత్రం 6 గంటల వరకు
స్థలం: TS EAPCET అడ్మిషన్ కార్యాలయం, మాసబ్‌ట్యాంక్, హైదరాబాద్

అధికారులు, నిపుణులు విద్యార్థుల సందేహాలకు సమాధానాలు ఇస్తారని ఉన్నత విద్యామండలి తెలిపింది. త్వరలో సబ్జెక్ట్ నిపుణులను కూడా అందుబాటులోకి తేనున్నట్లు పేర్కొన్నారు.


Today's Best Deals

Rs. 270.00

Emoji Expressions Matching Game

Rs. 480.00

Labubu Bunny Keychain

Rs. 100.00

Face Changing Keychain

Rs. 230.00

Busy Book