సూపర్‌స్టార్ మహేశ్ బాబు, స్టార్ డైరెక్టర్ ఎస్.ఎస్. రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న పాన్-వరల్డ్ సినిమా గురించి ఓ సెన్సేషనల్ అప్డేట్ బయటకు వచ్చింది. ఇప్పటివరకు అత్యంత రహస్యంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా టైటిల్‌ను హాలీవుడ్ దిగ్గజ దర్శకుడు జేమ్స్ కామెరూన్ చేతుల మీదుగా ఆవిష్కరించేందుకు రాజమౌళి భారీ ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.
వివరాల్లోకి వెళితే, ప్రముఖ హాలీవుడ్ చిత్రం “అవతార్: ద ఫైర్ అండ్ యాష్” ప్రమోషన్ కోసం జేమ్స్ కామెరూన్ నవంబర్ నెలలో భారత్‌కు రానున్నారు. ఇదే సరైన సమయమని భావించిన రాజమౌళి, ఆయనతో కలిసి తన సినిమాకు సంబంధించిన టైటిల్‌ను అధికారికంగా రివీల్ చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.
ఇదిలా ఉండగా, ఈ ప్రతిష్ఠాత్మక చిత్రానికి ‘వారణాసి’ (Varanasi) అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లు సమాచారం. అంతర్జాతీయ స్థాయిలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో భారతీయ నగరం పేరు పెట్టడం ఆసక్తికరంగా మారింది. వారణాసి నగరం చారిత్రకంగా, ఆధ్యాత్మికంగా ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు కలిగి ఉండటంతోనే రాజమౌళి ఈ పేరును పరిగణనలోకి తీసుకున్నారని టాక్.
ఈ గ్లోబల్ అడ్వెంచర్ సినిమాలో బాలీవుడ్ స్టార్ ప్రియాంక చోప్రా మరియు పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. దుర్గా ఆర్ట్స్ పతాకంపై కేఎల్ నారాయణ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఆస్కార్ అవార్డు విజేత ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు.