మహేశ్ బాబు-రాజమౌళి సినిమా సెట్టింగ్ వీడియో లీక్

సూపర్ స్టార్ మహేశ్ బాబుతో దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న చిత్రం ఎస్ఎస్ఏంబీ29. ప్రస్తుతం ఈ చిత్రం ఒడిశాలో చిత్రీకరణ జరుపుకుంటోంది. అయితే, రాజమౌళి ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా, ఏదో ఒకటి లీక్ అవుతూనే ఉన్నాయి.

తాజాగా, సెట్టింగ్‌కు సంబంధించిన విజువల్స్ బయటకు లీక్ అయ్యాయి. ఆ సెట్టింగ్స్ చూస్తే, మహేశ్ బాబుతో రాజమౌళి ఎంత పెద్ద సినిమా తీస్తున్నాడో అర్థమవుతోంది. సెటుపై ఉన్న ఒకరు సెల్ ఫోన్‌తో ఈ వీడియోను రికార్డ్ చేసినట్టు సమాచారం.

కాగా, ఈ చిత్రంలో ప్రియాంక చోప్రా హీరోయిన్‌గా నటిస్తోంది. మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రతినాయకపాత్ర పోషిస్తున్నట్టు సమాచారం. ఈ ఇంటర్నేషనల్ మూవీకి కేఎల్ నారాయణ నిర్మాత.


Today's Best Deals

Rs. 270.00

Emoji Expressions Matching Game

Rs. 480.00

Labubu Bunny Keychain

Rs. 100.00

Face Changing Keychain

Rs. 230.00

Busy Book