కెప్టెన్ గిల్ అజేయ శతకం – రెండో టెస్టులో తొలి రోజు భారత్ 310/5

ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో తొలి రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 310/5 పరుగులతో నిలిచింది. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ అద్భుత శతకం (114 నాటౌట్) తో జట్టును నిలబెట్టాడు. భారత్ ఓ దశలో కష్టాల్లో పడినా గిల్-జడేజా భాగస్వామ్యం జట్టును ఆదుకుంది.

ఇన్నింగ్స్ ప్రారంభంలో కేఎల్ రాహుల్ తక్కువ స్కోరుకే వెనుదిరిగాడు. తర్వాత యశస్వి జైస్వాల్ 87 పరుగులు చేసి ఇంగ్లండ్ బౌలర్లపై ధాటిగా ఆడాడు. కరుణ్ నాయర్ (32), పంత్ (25), నితీశ్ రెడ్డి (1) ఔటవ్వడంతో టీమిండియా స్కోరు 211/5కి పడిపోయింది.

ఈ పరిస్థితుల్లో గిల్ అద్భుతంగా ఆడి జడేజాతో కలిసి ఆరో వికెట్‌కు 99 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. గిల్ తన టెస్టు కెరీర్‌లో ఏడో శతకాన్ని పూర్తి చేశాడు. ఇంగ్లండ్‌పై వరుసగా శతకాలు బాదిన రెండో భారత కెప్టెన్‌గా (అజారుద్దీన్ తర్వాత) గిల్ అరుదైన గౌరవం పొందాడు. బౌలర్లలో క్రిస్ వోక్స్ రెండు వికెట్లు తీయగా, కార్స్, స్టోక్స్, బషీర్ తలో వికెట్ తీశారు.


Today's Best Deals

Rs. 270.00

Emoji Expressions Matching Game

Rs. 480.00

Labubu Bunny Keychain

Rs. 100.00

Face Changing Keychain

Rs. 230.00

Busy Book