షిర్డీ భక్తులకు శుభవార్త – షిర్డీకి ప్రత్యేక రైళ్లు ప్రకటించిన రైల్వే శాఖ

జులై 3 నుండి 25 వరకు సికింద్రాబాద్ - నాగర్‌సోల్ స్పెషల్ రైళ్లు – షిర్డీ భక్తులకు శుభవార్త

షిర్డీ సాయిబాబా దర్శనానికి వెళ్లే భక్తుల రద్దీ దృష్టిలో పెట్టుకుని దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. జులై 3 నుండి 25 వరకు సికింద్రాబాద్ - నాగర్‌సోల్ మధ్య స్పెషల్ రైళ్లు నడపనున్నట్లు ప్రకటించింది.

సికింద్రాబాద్ - నాగర్‌సోల్ స్పెషల్ రైలు (07007) ప్రతి గురువారం సికింద్రాబాద్ నుంచి రాత్రి 9:20 గంటలకు బయలుదేరి, తదుపరి రోజు ఉదయం 9:45 గంటలకు నాగర్‌సోల్ చేరుకుంటుంది.

నాగర్‌సోల్ - సికింద్రాబాద్ స్పెషల్ రైలు (07002) ప్రతి శుక్రవారం సాయంత్రం 5:30 గంటలకు నాగర్‌సోల్ నుంచి బయలుదేరి, మరుసటి రోజు ఉదయం 7:30 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది. ఈ రైలు మల్కాజ్‌గిరి, బొల్లారం, మేడ్చల్, కామారెడ్డి, నిజామాబాద్, బాసర, ముద్ఖేడ్, నాందేడ్, పూర్ణ, పర్బనీ, జాల్నా, ఔరంగాబాద్ స్టేషన్లలో ఆగుతుంది. రైలులో ఫస్ట్ ఏసీ, సెకండ్ ఏసీ, థర్డ్ ఏసీ కోచ్‌లు అందుబాటులో ఉంటాయని రైల్వే తెలిపింది.


Today's Best Deals

Rs. 270.00

Emoji Expressions Matching Game

Rs. 480.00

Labubu Bunny Keychain

Rs. 100.00

Face Changing Keychain

Rs. 230.00

Busy Book