ఆర్బీఐ కీలక నిర్ణయం: రెపో రేటును 5.5% వద్ద యథాతథంగా కొనసాగింపు

భారత రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) ఈసారి రెపో రేటును 5.5 శాతం వద్ద యథాతథంగా కొనసాగించనుంది. వరుసగా మూడు సార్లు వడ్డీ రేట్లను తగ్గించిన తర్వాత ఈసారి మాత్రం కోతకు బ్రేక్ వేసింది. జూన్‌లో ద్రవ్యోల్బణం 2.1%కి తగ్గినా, ఆర్బీఐ ముందు జాగ్రత్త చర్యగా వడ్డీ రేటును యథాతథంగా ఉంచింది.

ఈ నిర్ణయం తీసుకోవడానికి ప్రధాన కారణం అమెరికా భారత దిగుమతులపై విధించనున్న 25% టారిఫ్‌లు. అంతర్జాతీయ వాణిజ్య అనిశ్చితి నేపథ్యంలో భారత ఆర్ధిక వ్యవస్థపై ప్రభావం పడకూడదని ఆర్బీఐ ముందే జాగ్రత్త పడుతోంది. జూన్ నెలలో ద్రవ్యోల్బణం 4% లక్ష్య కంటే తక్కువగా ఉండడం మరో కీలక అంశం.

ఆర్బీఐ గత మూడు నెలలలో వడ్డీ రేట్లను 100 బేసిస్ పాయింట్ల మేర తగ్గించింది. పండుగల సీజన్‌కు ముందు ప్రజల డిమాండ్ పెరగడం, గృహ రుణాలు, రిటైల్ రంగం అభివృద్ధి చెందడం కోసం ఆ నిర్ణయాలు తీసుకుంది. ప్రస్తుతం మార్కెట్‌ పరిస్థితిని అంచనా వేసేందుకు వేచి చూసే ధోరణిలో ఉంది. భవిష్యత్‌లో అవసరమైతే మరిన్ని వడ్డీ కోతలకు అవకాశం ఉంది అని సంకేతాలు ఇచ్చింది.


Today's Best Deals

Rs. 270.00

Emoji Expressions Matching Game

Rs. 480.00

Labubu Bunny Keychain

Rs. 100.00

Face Changing Keychain

Rs. 230.00

Busy Book