RBI Jobs 2025: ఆర్‌బీఐ ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ విడుదల – డిగ్రీ పాస్ అయితే చాలు!

నోటిఫికేషన్ వివరాలు

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) తాజాగా గ్రేడ్ B ఆఫీసర్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. దేశవ్యాప్తంగా ఉన్న RBI బ్రాంచ్‌లలో మొత్తం 120 పోస్టులు భర్తీ చేయనున్నారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు సెప్టెంబర్ 30, 2025 సాయంత్రం 6 గంటల వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

పోస్టుల వివరాలు

  • గ్రేడ్ B ఆఫీసర్స్ (DR) – జనరల్: 83 పోస్టులు
  • గ్రేడ్ B ఆఫీసర్స్ (DR) – DEPR: 17 పోస్టులు
  • గ్రేడ్ B ఆఫీసర్స్ (DR) – DSIM: 20 పోస్టులు

అర్హతలు

  • జనరల్ స్ట్రీమ్: కనీసం 60% మార్కులతో డిగ్రీ (SC/ST/PwBD – 50%) లేదా 55% మార్కులతో PG.
  • DEPR స్ట్రీమ్: ఎకనామిక్స్/ఫైనాన్స్/ఎకనామెట్రిక్స్‌లో మాస్టర్స్ (కనీసం 55%). PGDM/MBA (ఫైనాన్స్) కూడా అర్హత.
  • DSIM స్ట్రీమ్: స్టాటిస్టిక్స్/మ్యాథమెటిక్స్‌లో మాస్టర్స్ (కనీసం 55%). ISI, IIT, IIM నుంచి స్పెషలైజ్డ్ PG డిప్లొమా కూడా అర్హత.

వయోపరిమితి

  • జూలై 1, 2025 నాటికి 21–30 సంవత్సరాలు.
  • M.Phil అర్హత కలిగిన వారికి గరిష్ట వయసు 32 సంవత్సరాలు, PhD ఉన్నవారికి 34 సంవత్సరాలు.

దరఖాస్తు రుసుము

  • General/OBC అభ్యర్థులు: ₹850
  • SC/ST/PwBD అభ్యర్థులు: ₹100

ఎంపిక విధానం

  • ప్రిలిమినరీ పరీక్ష
  • మెయిన్ పరీక్ష
  • ఇంటర్వ్యూ

పరీక్షల షెడ్యూల్

  • Phase I (General): అక్టోబర్ 18, 2025
  • Phase I (DEPR/DSIM): అక్టోబర్ 19, 2025
  • Phase II (General): డిసెంబర్ 06, 2025
  • Phase II (DEPR/DSIM): డిసెంబర్ 06, 2025

Today's Best Deals

Rs. 270.00

Emoji Expressions Matching Game

Rs. 480.00

Labubu Bunny Keychain

Rs. 100.00

Face Changing Keychain

Rs. 230.00

Busy Book