‘బాహుబలి’ రాకెట్ విజయం పట్ల రాజమౌళి ఆనందం – దేశానికి దక్కిన గౌరవమంటూ స్పందన

ఇస్రో ‘బాహుబలి’ రాకెట్‌పై రాజమౌళి హర్షం

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఇటీవల ప్రయోగించిన అత్యంత శక్తివంతమైన ‘ఎల్‌వీఎం3-ఎం5’ వాహకనౌకకు ‘బాహుబలి’ అని ముద్దుపేరుగా పెట్టారు. ఈ రాకెట్ సీఎంఎస్‌-03 కమ్యూనికేషన్ ఉపగ్రహాన్ని విజయవంతంగా కక్ష్యలో ప్రవేశపెట్టింది. అధిక బరువు, శక్తి సామర్థ్యం కారణంగా ఈ పేరును ఇస్రో శాస్త్రవేత్తలు పెట్టినట్లు తెలిపారు.

ఈ సందర్భంగా దర్శకధీరుడు ఎస్‌.ఎస్‌. రాజమౌళి ఆనందం వ్యక్తం చేశారు. తన బ్లాక్‌బస్టర్ చిత్రం బాహుబలి పేరును దేశపు శక్తివంతమైన రాకెట్‌కు పెట్టడం గొప్ప గౌరవమని ఆయన పేర్కొన్నారు. సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ రాజమౌళి ఇస్రో శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపారు.

“భారత అంతరిక్ష పరిశోధనలో మన సాంకేతిక ప్రతిభను ప్రతిబింబించే ఈ క్షణాలు దేశానికి గర్వకారణం. రాకెట్ బరువు, బలం కారణంగా దానికి ‘బాహుబలి’ అని పేరు పెట్టడం మాకు లభించిన గౌరవం. మా బాహుబలి బృందం అంతా చాలా సంతోషంగా ఉంది” అని రాజమౌళి తన పోస్టులో పేర్కొన్నారు. ఆయన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.


Today's Best Deals

Rs. 270.00

Emoji Expressions Matching Game

Rs. 480.00

Labubu Bunny Keychain

Rs. 100.00

Face Changing Keychain

Rs. 230.00

Busy Book