చిరంజీవి #Mega157 ముస్సూరీ షెడ్యూల్ పూర్తి – సంక్రాంతి 2026కి రిలీజ్ సిద్ధం
మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న #Mega157 చిత్ర యూనిట్ ముస్సూరీ వద్ద రెండో షెడ్యూల్‌ను విజయవంతంగా పూర్తి చేసింది. ఈ సినిమాకు అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నారు. సినిమా షూటింగ్ ప్రకృతి సోయగాలతో ముస్తాబైన ముస్సూరీ లో హై ఎనర్జీ సన్నివేశాలతో సాగింది.
ఈ విషయాన్ని గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సోషల్ మీడియా వేదికగా అధికారికంగా వెల్లడించింది:
"షూటింగ్ సెట్స్ పై మేము మజా, మేజిక్ రెండూ కలిపాం. ముస్సూరీ షెడ్యూల్ విజయవంతంగా ముగిసింది. చిరంజీవి హై ఎనర్జీ పెర్ఫార్మెన్స్ ఈ సినిమాను థియేటర్లలో పేలుస్తుంది. సంక్రాంతి 2026కి రెడీ అవ్వండి!" అంటూ పోస్ట్ చేసింది.
దర్శకుడు అనిల్ రావిపూడి కూడా స్పందిస్తూ, "ముస్సూరీ షెడ్యూల్ పూర్తైంది. సంక్రాంతికి సందడి ఉండబోతుంది. తదుపరి షెడ్యూల్ కోసం సిద్ధమవుతున్నాం." అన్నారు. ఈ షెడ్యూల్‌కి పదిరోజుల ప్లాన్ ఉండగా, చిత్రబృందం ఖచ్చితంగా షెడ్యూల్‌కు కట్టుబడి పనిచేసిందట.
ఈ సినిమాను షైన్ స్క్రీన్స్ మరియు గోల్డ్ బాక్స్ బ్యానర్లపై సాహూ గారపాటి, సుశ్మిత కొణిదెల సంయుక్తంగా నిర్మిస్తున్నారు. నయనతార మరోసారి చిరంజీవితో కలిసి స్క్రీన్ షేర్ చేయడం విశేషం. ఇప్పటికే సైరా, గాడ్‌ఫాదర్ సినిమాల్లో ఈ జోడీ అభిమానులను ఆకట్టుకుంది.
ఈ చిత్రానికి భీమ్స్ సిసిరోలియో సంగీతాన్ని అందిస్తుండగా, సమీర్ రెడ్డి సినిమాటోగ్రఫీ, తమ్మిరాజు ఎడిటింగ్, ఏఎస్ ప్రకాష్ ఆర్ట్ డైరెక్షన్ బాధ్యతలు తీసుకున్నారు. కథను ఎస్ కృష్ణ మరియు జి.ఆది నారాయణ కలిసి అందించారు. ఈ చిత్రాన్ని సంక్రాంతి 2026 సందర్భంగా గ్రాండ్‌గా విడుదల చేయాలని యూనిట్ ప్లాన్ చేస్తోంది.