నసేనాధ్యక్షుడికి విజయ శుభాకాంక్షలు.. పవన్‌ను సర్ప్రైజ్ చేసిన చిరంజీవి

నేడు మెగాస్టార్ చిరంజీవి 70వ పుట్టినరోజు. ఈ సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో అభిమానులు పండగ చేసుకుంటున్నారు. సినీ, రాజకీయ రంగాల ప్రముఖులు కూడా చిరంజీవికి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తన అన్నయ్య చిరంజీవికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయన పట్టుదల, కృషిని ప్రశంసించారు.

దీనికి స్పందించిన చిరంజీవి, పవన్‌కు విజయ ఆశీస్సులు అందిస్తూ ఓ ఎమోషనల్ ట్వీట్ చేశారు. “జనసేన అధ్యక్షుడికి విజ‌యోస్తు! నీ పోరాటం నాకు గర్వకారణం. నీ వెనుక ఉన్న సైన్యాన్ని రాజువై నడిపించు” అంటూ అన్నయ్య ప్రేమను వ్యక్తం చేశారు.

అంతేకాకుండా చిన్నప్పటి పాత ఫొటోను జోడించి అభిమానులకు సర్‌ప్రైజ్ ఇచ్చారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారి అభిమానులను ఆకట్టుకుంటోంది.


Today's Best Deals

Rs. 270.00

Emoji Expressions Matching Game

Rs. 480.00

Labubu Bunny Keychain

Rs. 100.00

Face Changing Keychain

Rs. 230.00

Busy Book