హైదరాబాద్, సెప్టెంబర్ 2:
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు, మెగాస్టార్ చిరంజీవి, హీరో అల్లు అర్జున్ లు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేనాధినేత పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు.
సీఎం చంద్రబాబు నాయుడు తన శుభాకాంక్షలను X (ట్విట్టర్) ద్వారా తెలుగులో తెలియజేశారు. ప్రజల పట్ల పవన్ కళ్యాణ్ చూపుతున్న సానుభూతి, విలువలకు కట్టుబడి ఉండడం, మాట తప్పక నిలబడటం వంటి లక్షణాలను ప్రశంసించారు. రాష్ట్ర పరిపాలన, అభివృద్ధిలో ఆయన సహకారం అమూల్యమని పేర్కొంటూ, మరిన్ని విజయ శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.
మెగాస్టార్ చిరంజీవి తన తమ్ముడు పవన్ కళ్యాణ్‌కు ఆశీర్వచనాలు అందిస్తూ, ఆరోగ్యంగా వందేళ్లు జీవించి ప్రజలకు మార్గదర్శకుడిగా నిలవాలని కోరుకున్నారు. సినీ నటుడిగా, జనసేన నాయకుడిగా, అలాగే ఉప ముఖ్యమంత్రిగా పవన్ చేస్తున్న ప్రజాసేవ విశేషమని అభినందించారు.
హీరో అల్లు అర్జున్ తన సోషల్ మీడియా ద్వారా “Our Powerstar & Deputy CM @PawanKalyan garu – Heartfelt Birthday Wishes” అని శుభాకాంక్షలు తెలిపారు.
ఇకపోతే, రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు మాత్రమే కాక, దేశం నలుమూలల నుంచి లక్షలాది అభిమానులు పవన్ కళ్యాణ్ పుట్టినరోజును ఉత్సాహంగా జరుపుకున్నారు.