హైదరాబాద్, మే 13: జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (JEE అడ్వాన్స్‌డ్) 2025కు సంబంధించిన హాల్‌టికెట్లు విడుదలయ్యాయి. ఈ హాల్‌టికెట్లు ఐఐటీ కాన్పూర్ అధికారిక వెబ్‌సైట్ jeeadv.ac.inలో అందుబాటులో ఉన్నాయి. పరీక్షకు దరఖాస్తు చేసిన అభ్యర్థులు తమ నమోదు వివరాలతో లాగిన్ అయి హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్ష మే 18వ తేదీన దేశవ్యాప్తంగా నిర్వహించనున్నారు. ఈ పరీక్ష మొత్తం రెండు పేపర్లుగా ఉంటుంది. పేపర్ 1 ఉదయం 9:00 నుంచి 12:00 గంటల వరకు, పేపర్ 2 మధ్యాహ్నం 2:30 నుంచి 5:30 గంటల వరకు జరుగుతుంది. జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో సాధించిన ర్యాంకు ఆధారంగా దేశవ్యాప్తంగా ఉన్న 23 ఐఐటీల్లో ప్రవేశాలు కల్పించనున్నారు.
అదే విధంగా, తెలంగాణ పాలిసెట్ 2025 పరీక్ష కూడా నేడు, మే 13 (మంగళవారం)న రాష్ట్రవ్యాప్తంగా జరుగుతుంది. ఈ పరీక్ష పాలిటెక్నిక్ (డిప్లొమా) కోర్సులలో ప్రవేశాల కోసం నిర్వహించబడుతుంది. మొత్తం 1,06,716 మంది విద్యార్థులు ఈ పరీక్షకు హాజరవుతున్నారు. ఇది ఉదయం 11:00 గంటల నుంచి మధ్యాహ్నం 1:30 గంటల వరకు OMR విధానంలో 276 పరీక్షా కేంద్రాలలో నిర్వహించనున్నారు.