ఇంటెల్‌లో 25,000 ఉద్యోగాల కోత
ప్రపంచ ప్రఖ్యాత చిప్ తయారీ కంపెనీ అయిన ఇంటెల్, భారీ స్థాయిలో ఉద్యోగాల తొలింపునకు సిద్ధమవుతోంది. కంపెనీ చేపట్టిన గ్లోబల్ రీస్ట్రక్చరింగ్ ప్రక్రియలో భాగంగా దాదాపు 25,000 ఉద్యోగాలను తొలగించనున్నట్లు సమాచారం. వ్యయాలను తగ్గించడానికి, మరియు నష్టాలను అధిగమించడానికి ఈ చర్య తీసుకుంటున్నారు.
ఇది ఎలాంటి శాఖలను ప్రభావితం చేస్తుందనే దానిపై సంస్థ ఇంకా స్పష్టత ఇవ్వలేదు. అయితే ఉత్పత్తి, పరిశోధన, పరిపాలన విభాగాల్లో ఈ కోతలు ఉండే అవకాశం ఉందని సమాచారం. స్లో డిమాండ్, మరియు పెరుగుతున్న పోటీ కారణంగా ఇంటెల్‌కి ఈ కఠిన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది.
ఈ ఉద్యోగ కోతలు అమెరికా, యూరోప్, ఆసియా వంటి దేశాల్లోని ఉద్యోగులను ప్రభావితం చేయనున్నాయి. టెక్ ఇండస్ట్రీలో ఇటీవలి కాలంలో పలుచోట్ల ఉద్యోగాల్లో కోతలు కనిపిస్తున్న నేపథ్యంలో ఇది కూడా ఒక భాగంగా మారింది. బాధిత ఉద్యోగులకు అవసరమైన మద్దతు అందిస్తామని ఇంటెల్ తెలిపింది.