హెచ్‌-1బీ వీసా: అమెరికా కీలక వ్యాఖ్యలు – త్వరలో భారీ మార్పులు!

అమెరికా ప్రభుత్వం హెచ్‌-1బీ వీసా విధానంలో భారీ మార్పులకు సన్నాహాలు చేస్తోంది. 2026 ఫిబ్రవరి నాటికి కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయని అమెరికా వాణిజ్య మంత్రి హోవార్డ్ లుట్నిక్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత లాటరీ విధానం లోపభూయిష్టమని ఆయన స్పష్టం చేస్తూ, అత్యంత నైపుణ్యం కలిగిన వారిని లాటరీ ద్వారా కాకుండా నేరుగా ఎంపిక చేసే విధంగా వ్యవస్థ మార్పులు అవసరమని అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం జారీ అవుతున్న హెచ్‌-1బీ వీసాల్లో 74 శాతం టెక్ నిపుణులకే వెళ్తున్నాయని, అయితే డాక్టర్లు, విద్యావేత్తల వంటి కీలక రంగాల నిపుణులకు కేవలం 4 శాతం మాత్రమే లభిస్తున్నదని లుట్నిక్ వివరించారు. అమెరికా దేశానికి ఉన్నత డిగ్రీలు కలిగిన డాక్టర్లు, విద్యావేత్తలు కూడా అవసరమని ఆయన స్పష్టం చేశారు. కేవలం చౌకగా లభించే టెక్ నిపుణుల కోసం మాత్రమే ఈ వీసా కేటాయింపులు సరికాదని, అవసరమైతే అధిక ఫీజు వసూలు చేసినా తప్పులేదని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ వ్యాఖ్యలు రాబోయే కాలంలో హెచ్‌-1బీ వీసా నిబంధనలు మరింత కఠినతరం కాబోతున్నాయన్న సంకేతాలను ఇస్తున్నాయి.


Today's Best Deals

Rs. 270.00

Emoji Expressions Matching Game

Rs. 480.00

Labubu Bunny Keychain

Rs. 100.00

Face Changing Keychain

Rs. 230.00

Busy Book