ఢిల్లీ మోతీనగర్‌లో భారీ అగ్నిప్రమాదం
దేశ రాజధాని ఢిల్లీలోని మోతీనగర్‌లో ఓ ఫంక్షన్ హాలులో నిన్న రాత్రి భారీ అగ్నిప్రమాదం జరిగింది. రాత్రి 8:47 గంటల సమయంలో మంటలు ఒక్కసారిగా చెలరేగి ఫంక్షన్ హాల్‌ను చుట్టుముట్టాయి. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో భారీగా పొగలు ఏర్పడి స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక శాఖ మరియు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మొత్తం 18 ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపులోకి తీసుకువచ్చారు.
ప్రస్తుతం ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. మంటల వల్ల జరిగిన నష్టం, ప్రాణనష్టం జరిగిందా అనే విషయాలు అధికారుల అన్వేషణలో ఉన్నాయి. మరిన్ని వివరాలు త్వరలో వెల్లడయ్యే అవకాశం ఉంది.