మెగాస్టార్ చిరంజీవి ‘విశ్వంభర’ చిత్రం నుంచి కీలక అప్‌డేట్
రేపు (ఆగస్టు 21) ఉదయం 9:09 గంటలకు ఒక ముఖ్యమైన ప్రకటన రాబోతోంది.
సోషల్ మీడియాలో స్వయంగా ప్రకటించిన చిరంజీవి మాటలతో అభిమానుల్లో ఉత్సాహం మరింతగా పెరిగింది.
భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఫాంటసీ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘విశ్వంభర’ పై మొదటి నుంచే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాల కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తుండగా, రేపటి అప్‌డేట్‌తో వారి నిరీక్షణ ముగియనుంది.
సినీ వర్గాల్లో అయితే ఇది టీజర్ అవుతుందా, కొత్త పోస్టర్ అవుతుందా లేక మరేదైనా కీలక సమాచారం అవుతుందా అనే ఊహాగానాలు జోరుగా సాగుతున్నాయి. అసలు అప్‌డేట్ ఏమై ఉంటుందోనని మెగా అభిమానులు సోషల్ మీడియాలో చర్చించుకుంటున్నారు. ఇక ఇంకొన్ని గంటల్లోనే ఈ ఉత్కంఠకు తెరపడనుంది.
ఈ చిత్రానికి ‘బింబిసార’ ఫేమ్ వశిష్ట దర్శకత్వం వహిస్తున్నాడు.