భారత్ బంద్ నేడు: బ్యాంకులు, రవాణా సేవలు స్తంభించే అవకాశాలు

కేంద్ర ప్రభుత్వ కార్మిక, ప్రజావ్యతిరేక విధానాలకు నిరసనగా నేడు దేశవ్యాప్తంగా భారత్ బంద్ జరుగుతోంది. ఈ బంద్‌లో 25 కోట్లకు పైగా కార్మికులు పాల్గొననున్నట్లు సంఘాలు తెలిపాయి.

పది ప్రధాన కార్మిక సంఘాలు, రైతు సంఘాలు కలిసి బంద్‌కు పిలుపునిచ్చాయి. బ్యాంకింగ్, రవాణా, విద్యుత్, పోస్టల్ వంటి ముఖ్య రంగాల సేవలు స్తంభించే అవకాశం ఉంది.

స్తంభించనున్న సేవలు:

  • బ్యాంకులు పూర్తిగా మూతపడే అవకాశం ఉంది. ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ (AIBEA) బంద్‌కు మద్దతు తెలిపింది.

  • బొగ్గుగనులు, కర్మాగారాలు, పోస్టల్ సేవలు ఆగిపోవచ్చు.

  • విద్యుత్ రంగానికి చెందిన 27 లక్షల మంది ఉద్యోగులు పాల్గొనడం వల్ల కరెంట్ సరఫరాలో అంతరాయం కలగవచ్చు.

  • బస్సులు, ఆటోలు, ట్యాక్సీలు పలు నగరాల్లో రోడ్డుపై కనిపించకపోవచ్చు.

  • రైల్వే యూనియన్లు అధికారికంగా పాల్గొనకపోయినా, ట్రాక్‌ల వద్ద ఆందోళనలు జరిగే అవకాశం ఉంది.

  • పాఠశాలలు, కళాశాలలు యథావిధిగా కొనసాగుతాయి. సెలవు లేదు.

సమ్మెకు కారణాలు:

కార్మిక సంఘాల ప్రకారం, ఈ బంద్ ఈ క్రింది విషయాలకు వ్యతిరేకంగా జరుగుతోంది:

  • కార్మిక చట్టాల్లో మార్పులు (లేబర్ కోడ్‌లు)

  • ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ

  • ఉద్యోగాల్లో ఔట్‌సోర్సింగ్, కాంట్రాక్టు విధానం

  • పెరుగుతున్న నిరుద్యోగం, ధరల పెరుగుదల

  • వేతనాల కోత

17 డిమాండ్ల సాధన కోసమే ఈ సమ్మె చేపడుతున్నట్లు కార్మిక సంఘాలు పేర్కొన్నాయి.
ఈ బంద్‌కు సంయుక్త కిసాన్ మోర్చా కూడా మద్దతు తెలిపినందున, గ్రామీణ ప్రాంతాల్లో పెద్దఎత్తున నిరసనలు జరుగే అవకాశం ఉంది.


Today's Best Deals

Rs. 270.00

Emoji Expressions Matching Game

Rs. 480.00

Labubu Bunny Keychain

Rs. 100.00

Face Changing Keychain

Rs. 230.00

Busy Book