కృష్ణా నదీ పరీవాహక ప్రాంతాల ప్రజలకు ఏపీఎస్డీఎంఏ హెచ్చరిక

ప్రకాశం బ్యారేజీకి భారీగా వరద నీరు

విజయవాడలోని ప్రకాశం బ్యారేజీకి ఎగువ ప్రాంతాల నుంచి వరద నీరు భారీగా వస్తోంది. భారీ వర్షాల ప్రభావంతో బ్యారేజీ వద్ద నీటి మట్టం 12 అడుగుల పూర్తి స్థాయికి చేరింది. దీంతో జలవనరుల శాఖ అధికారులు గేట్లు ఎత్తి దిగువకు వరద నీటిని విడుదల చేస్తున్నారు.

ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) ప్రకారం, బ్యారేజీకి వచ్చే ఇన్‌ఫ్లో మరియు అవుట్‌ఫ్లోను బట్టి నీటి విడుదల కొనసాగుతోంది. నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నందున కృష్ణా నది పరివాహక ప్రాంత ప్రజలు, ముఖ్యంగా లంక గ్రామాల వారు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.

నదిలో ప్రయాణించడం, ఈత కొట్టడం, చేపలు పట్టడం వంటి కార్యక్రమాలు పూర్తిగా నివారించాలన్నారు. ప్రజలు అధికారుల సూచనలను పాటించి భద్రతా పరంగా వ్యవహరించాలని APSDMA కోరుతోంది.


Today's Best Deals

Rs. 270.00

Emoji Expressions Matching Game

Rs. 480.00

Labubu Bunny Keychain

Rs. 100.00

Face Changing Keychain

Rs. 230.00

Busy Book