The sun is breaking in the morning.. If this is the case now, people are afraid of what the coming days will be like. Temperatures are higher than normal temperatures everywhere. With the sun after 10 o'clock in the morning, with the hailstorm in the afternoon, people are afraid to go out. The authorities of both the states have issued warnings against the backdrop of scorching sun in the Telugu states. Officials suggest to go out only if necessary. It is also advised to take precautionary measures to prevent sunburn.
In the background of rising sun, AP government has released a latest announcement. A hail warning has been issued for 98 mandals in AP. Alluri, Anacapalli, Tugo, Eluru, Guntur, Kakinada, Krishna, NTR, Palnadu, Parvathipuram Manyam, Srikakulam, Visakha, Vizianagaram and Kadapa districts are likely to experience hailstorm. Officials advised people in these districts to be alert.
And in Telangana too, the sun is blazing. The authorities have issued warnings as the temperature is higher than 44 degrees in many districts. He said that people should take care not to get sunburned. Officials advise not to come out except in emergency situations.
Telugu version
సూర్యుడు ఉదయాన్నే మాడు పగులకొడుతున్నాడు.. ఇప్పుడే ఇలా ఉంటే రానున్న రోజులు ఎలా ఉంటాయోననే భయం జనాల్లో కలుగుతోంది. సాధారణ ఉష్ణోగ్రతలకంటే.. అన్ని చోట్ల అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉదయం 10 గంటల తర్వాత ఎండతో.. మధ్యాహ్నం వడగాలులతో బయటికి వెళ్లాలంటేనే జంకుతున్నారు.. మరో రెండ్రోజులపాటు ఎండలు తీవ్రంగా ఉంటాయని వాతావరణ శాఖ వెల్లండించింది. తెలుగు రాష్ట్రాల్లో ఎండలు దంచికొడుతున్న నేపథ్యంలో ఇరు రాష్ట్రాల అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. అవసరమైతేనే బయటకు వెళ్లాలంటూ అధికారులు సూచిస్తున్నారు. ఇంకా వడదెబ్బ తగలకుండా జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు.
ఎండలు పెరుగుతున్న నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం.. తాజాగా ప్రకటన విడుదల చేసింది. ఏపీలో 98 మండలాలకు వడగాల్పుల హెచ్చరికలు జారీ చేసింది. అల్లూరి, అనకాపల్లి, తూ.గో, ఏలూరు, గుంటూరు, కాకినాడ, కృష్ణా, ఎన్టీఆర్, పల్నాడు, పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం, విశాఖ, విజయనగరం, కడప జిల్లాల్లో వడగాల్పులకు అవకాశం ఉందని పేర్కొంది. ఈ జిల్లాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారుల సూచించారు.
ఇక తెలంగాణలోనూ మాడుపగిలేలా ఎండలు దంచికొడుతున్నాయి. పలు జిల్లాల్లో 44 డిగ్రీల కన్నా అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ప్రజలంతా ఎండదెబ్బ బారినపడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొన్నారు. అత్యవసర పరిస్థితుల్లో తప్ప బయటకు రావొద్దంటూ అధికారులు సూచిస్తున్నారు.