AP మెగా DSC: సర్టిఫికేట్‌ల పరిశీలన వాయిదా

ఈ రోజు నుంచి ప్రారంభం కావాల్సిన AP మెగా DSC సర్టిఫికేట్‌ల పరిశీలన వాయిదా పడింది. పాఠశాల విద్యాశాఖ ఆదివారం రాత్రి ప్రకటించిన ప్రకారం, సర్టిఫికేట్ వెరిఫికేషన్‌ను రేపటికి మార్చారు.

అసలు షెడ్యూల్ ప్రకారం ఆదివారం అభ్యర్థుల లాగిన్‌లో కాల్ లెటర్లు అందుబాటులో ఉంచి, ఈ రోజు నుంచి పరిశీలన జరగాల్సి ఉంది. అయితే కాల్ లెటర్ ప్రక్రియ ఆలస్యమవడంతో వెరిఫికేషన్‌ను వాయిదా వేసింది.

ఇకపై అభ్యర్థులు ఈ రోజు ఉదయం నుంచి తమ లాగిన్‌లో కాల్ లెటర్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. రేపటి నుంచి సర్టిఫికేట్‌ల పరిశీలన జరుగుతుంది. ఇప్పటికే డీఎస్సీ మెరిట్ జాబితాను విడుదల చేసిన విద్యాశాఖ, రిజర్వేషన్లు మరియు స్థానికత ఆధారంగా అర్హులైన వారికి ర్యాంకులు కేటాయించింది. నియామక నిబంధనల ప్రకారం ఎంపికైన వారికి కాల్ లెటర్లు జారీ చేయనున్నారు.


Today's Best Deals

Rs. 270.00

Emoji Expressions Matching Game

Rs. 480.00

Labubu Bunny Keychain

Rs. 100.00

Face Changing Keychain

Rs. 230.00

Busy Book