ఏపీ హైకోర్టు ఉద్యోగాలు: 245 పోస్టుల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ – నిరుద్యోగులకు శుభవార్త!

ఏపీ హైకోర్టులో 245 పోస్టుల భర్తీకి అనుమతి – త్వరలో నోటిఫికేషన్ విడుదల

అమరావతి, మే 30 – ఆంధ్రప్రదేశ్‌ నిరుద్యోగులకు శుభవార్త! ఏపీ హైకోర్టులో 245 ఖాళీ పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.

ఇందులో 242 పోస్టులను రెగ్యులర్ పద్ధతిలో, మిగిలిన 3 పోస్టులను కాంట్రాక్ట్‌ పద్ధతిలో భర్తీ చేయనున్నారు. ఈ మేరకు న్యాయశాఖ కార్యదర్శి జి. ప్రతిభాదేవి ఉత్తర్వులు జారీ చేశారు.

తొరలోనే దీనికి సంబంధించిన వివరమైన నోటిఫికేషన్ విడుదల కానుంది. వివిధ విభాగాల్లో ఖాళీలు భర్తీ చేయాలని హైకోర్టు, ప్రభుత్వ అధికారులు నిర్ణయం తీసుకున్నారు.

ఈ నోటిఫికేషన్‌లో ఇవి చేర్చనున్నారు:

  • పోస్టుల వివరాలు

  • అర్హతలు

  • వయోపరిమితి

  • జీతభత్యాలు

  • దరఖాస్తు విధానం

  • ప్రారంభ, చివరి తేదీలు

  • అప్లికేషన్ ఫీజు

  • ఎంపిక ప్రక్రియ

ఇప్పటికే హైకోర్టు 1,620 పోస్టుల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతుంది. ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ జూన్ 2.

ఇక రాష్ట్రంలో ఉద్యోగ ప్రకటనలు దశల వారీగా వస్తున్నాయి. ఇటీవలే 16,347 పోస్టులతో మెగా డీఎస్సీ నోటిఫికేషన్ 2025 విడుదల కాగా, త్వరలో రాత పరీక్షలు జరగనున్నాయి.

అలాగే జిల్లా కోర్టుల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల కోసం ఆన్‌లైన్ దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. మరో కొత్త నోటిఫికేషన్ త్వరలో విడుదల కానుంది. పూర్తి వివరాలను అధికారిక వెబ్‌సైట్‌లో చెక్ చేయవచ్చు.


Today's Best Deals

Rs. 270.00

Emoji Expressions Matching Game

Rs. 480.00

Labubu Bunny Keychain

Rs. 100.00

Face Changing Keychain

Rs. 230.00

Busy Book