Telangana

హైదరాబాద్‌లో హై అలర్ట్ ప్రకటించిన పోలీసులు

హైదరాబాద్, నవంబర్ 10: ఢిల్లీలోని రెడ్‌ఫోర్ట్ సమీపంలో జరిగిన పేలుడు ఘటన నేపథ్యంలో హైదరాబాద్‌లో హై అలర్ట్ జారీ చేశారు. ఈ ఘటనలో 10 మంది మరణించగా, పలువురు గాయపడ్డారు.

హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ పరిధిలో పోలీసులు వాహనాలు, ప్రజలను తనిఖీ చేస్తున్నారు. నగరవ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేశారు.

ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద వస్తువులు లేదా వ్యక్తులు కనిపించిన వెంటనే 100 నంబర్‌కు సమాచారం ఇవ్వాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు.

రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో సీఐఎస్ఎఫ్, డాగ్ స్క్వాడ్, బాంబ్ స్క్వాడ్ బృందాలు కఠిన తనిఖీలు నిర్వహిస్తున్నాయి. అలాగే దేశవ్యాప్తంగా ఉన్న విమానాశ్రయాలు, వారసత్వ కట్టడాలు, ప్రభుత్వ భవనాలు వద్ద భద్రత పెంచారు.

సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ రైల్వే స్టేషన్లలో ఆర్‌పీఎఫ్, జీఆర్‌పీ, బాంబ్ డిటెక్షన్ బృందాలు తనిఖీలు చేపట్టాయి. హైదరాబాద్ మెట్రో స్టేషన్లలో కూడా భద్రత కట్టుదిట్టం చేశారు.

ఇక ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ, గుంటూరు, విశాఖపట్నం, తిరుపతి నగరాల్లో కూడా పోలీసులు తనిఖీలు పెంచారు. తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి దేవస్థానం (TTD) పరిధిలో కూడా భద్రతను మరింత బలోపేతం చేశారు.


Today's Best Deals

Rs. 270.00

Emoji Expressions Matching Game

Rs. 480.00

Labubu Bunny Keychain

Rs. 100.00

Face Changing Keychain

Rs. 230.00

Busy Book