వాంఖడే స్టేడియంలో రోహిత్ శర్మకు అరుదైన గౌరవం
టీమిండియా స్టార్ ప్లేయర్ రోహిత్ శర్మకు ముంబయి క్రికెట్ అసోసియేషన్ (MCA) అరుదైన గౌరవం అందించింది. శుక్రవారం వాంఖడే క్రికెట్ స్టేడియంలోని ఒక స్టాండ్‌కు రోహిత్ శర్మ పేరు పెట్టి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి తన తల్లిదండ్రులు, భార్య రితికాతో కలిసి హాజరైన రోహిత్ చాలా ఎమోషనల్ అయ్యారు.
వాంఖడే తనకు ఎంతో ప్రత్యేకమైన స్థలం అని, ఇక్కడ ఎన్నో మధుర జ్ఞాపకాలున్నాయని చెప్పారు. భవిష్యత్తులో వన్డే మ్యాచ్‌లో టీమిండియాకు ప్రాతినిధ్యం వహిస్తూ ఈ స్టేడియంలో మళ్లీ ఆడాలనే కోరికను ఆయన వ్యక్తం చేశారు. తన పేరుతో స్టాండ్ ఉంటుందని ఎన్నడూ ఊహించలేదని చెప్పారు.
ఈ గౌరవం జీవితంలో ప్రత్యేకమైనది అని పేర్కొన్నారు. సునీల్ గవాస్కర్, సచిన్ టెండూల్కర్, వినూ మన్కడ్, దిలీప్ వెంగ్‌సర్కార్ వంటి దిగ్గజాల మధ్య తన పేరు ఉండటం ఎంతో గర్వంగా ఉందన్నారు. ముంబయి క్రికెట్ అసోసియేషన్‌కు ఈ గౌరవానికి రోహిత్ ధన్యవాదాలు తెలిపారు.