టాలీవుడ్ హీరో రామ్ చరణ్ కు అరుదైన గౌరవం దక్కింది. లండన్ లోని మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియం లో ఆయన మైనపు విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ఆయన భార్య ఉపాసన, కుమార్తె క్లీంకార, తల్లి దండ్రులు చిరంజీవి, సురేఖ లతో కలిసి లండన్ పయనమయ్యారు. ఈ సందర్భంగా అభిమానులు ఎంతో గర్వంగా భావిస్తున్నారు.
ప్రపంచ ప్రఖ్యాతుల మైనపు విగ్రహాలకు పేరొందిన మేడమ్ టుస్సాడ్స్‌లో ఇప్పుడు రామ్ చరణ్ కూడా స్థానం పొందారు. భారతీయులలో కొద్ది మందికే లభించే ఈ అవకాశాన్ని రామ్ చరణ్ పొందడం తెలుగు సినీ పరిశ్రమకు గౌరవకరం.
RRR సినిమా ద్వారా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన రామ్ చరణ్, ఇప్పుడు గ్లోబల్ స్టార్ గా మరింతగా నిలిచారు. మైనపు విగ్రహం ఎలా ఉందని, ఇది ఎప్పుడు ప్రజలకు చూపించబడుతుందోనని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.