విజయ్ దేవరకొండ, గౌతమ్ తిన్ననూరి కాంబోలో ‘కింగ్డమ్’ – తాజా వైల్డ్ పోస్టర్ విడుదల
విజయ్ దేవరకొండ నటిస్తున్న కొత్త చిత్రం కింగ్డమ్, జాతీయ అవార్డు విజేత గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రూపొందుతోంది. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ ఈ పాన్ ఇండియా చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో విజయ్ సరసన యంగ్ హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే నటిస్తోంది.
ఈ మూవీలో విజయ్ కొత్త అవతార్‌లో కనిపించబోతున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్, టైటిల్ టీజర్‌కు మంచి స్పందన వచ్చింది. ఈ సినిమా మే 29న థియేటర్లలో విడుదల కానుంది. తాజాగా మేకర్స్ విడుదల చేసిన వైల్డ్ పోస్టర్ సినిమాపై హైప్‌ను మరింత పెంచింది.
"కింగ్డమ్ మాసం పాలించడానికి సిద్ధంగా ఉంది" అనే క్యాప్షన్‌తో విడుదల చేసిన ఈ పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇటీవల విజయ్ చేసిన చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఫలితం ఇవ్వకపోవడంతో, కింగ్డమ్ సినిమాతో మళ్లీ బలంగా తిరిగి రావాలని అభిమానులు ఆశిస్తున్నారు.