tics Andhra Pradesh

ఏపీ హైకోర్టు ఉద్యోగాలు 2025: 7వ తరగతి మరియు డిగ్రీ అర్హతతో 1,620 పోస్టుల నోటిఫికేషన్ విడుదల

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 1620 పోస్టుల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో జూనియర్‌ అసిస్టెంట్‌, స్టెనోగ్రాఫర్‌ గ్రేడ్‌-3, టైపిస్ట్‌, ఫీల్డ్‌ అసిస్టెంట్‌, ఎగ్జామినర్‌, కాపీయిస్ట్‌, డ్రైవర్‌ (లైట్ వెహికిల్), రికార్డు అసిస్టెంట్‌, ప్రాసెస్‌ సర్వర్‌, ఆఫీస్‌ సబార్డినేట్‌ తదితర ఉద్యోగాలున్నాయి. అర్హత కలిగిన అభ్యర్థులు మే 13, 2025 నుంచి జూన్ 2, 2025 వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

పోస్ట్‌ వారీగా ఖాళీలు ఇలా ఉన్నాయి: స్టెనోగ్రాఫర్‌ గ్రేడ్‌-3 – 80, జూనియర్‌ అసిస్టెంట్‌ – 230, టైపిస్ట్‌ – 162, ఫీల్డ్‌ అసిస్టెంట్‌ – 56, ఎగ్జామినర్‌ – 32, కాపీయిస్ట్‌ – 193, డ్రైవర్‌ – 28, రికార్డు అసిస్టెంట్‌ – 24, ప్రాసెస్‌ సర్వర్‌ – 164, ఆఫీస్‌ సబార్డినేట్‌ – 651. అభ్యర్థులు ఆయా పోస్టులకు అనుగుణంగా డిగ్రీ, ఇంటర్‌, 10వ తరగతి లేదా 7వ తరగతి విద్యార్హత కలిగి ఉండాలి.

వయోపరిమితి 2025 జులై 1వ తేదీ నాటికి 18 నుండి 42 ఏళ్ల మధ్య ఉండాలి. దరఖాస్తు ఫీజుగా జనరల్‌, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులు ₹800, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు ₹400 చెల్లించాల్సి ఉంటుంది. అభ్యర్థుల ఎంపిక రాత పరీక్ష ఆధారంగా జరుగుతుంది.

ఎంపికైన అభ్యర్థులకు వేతన వివరాలు ఇలా ఉన్నాయి: స్టెనోగ్రాఫర్‌ పోస్టుకు నెలకు ₹34,580 నుండి ₹1,07,210 వరకు, జూనియర్‌ అసిస్టెంట్‌, టైపిస్ట్‌, ఫీల్డ్‌ అసిస్టెంట్‌ పోస్టులకు ₹25,200 నుండి ₹80,910 వరకు, ఆఫీస్‌ సబార్డినేట్‌ పోస్టుకు ₹20,000 నుండి ₹61,960 వరకు, మిగతా పోస్టులకు ₹23,380 నుండి ₹76,730 వరకు జీతం చెల్లించబడుతుంది.


Today's Best Deals

Rs. 350.00

Piggy Bank

Rs. 650.00

Bullet Gun

Rs. 449.00

Camera Water Bottle

Rs. 150.00

Magic Sketch Pens