UIDAI: మీ పిల్లల ఆధార్ అప్‌డేట్ చేశారా? కీలక సూచనలు విడుదల

పాఠశాల విద్యార్థుల ఆధార్ అప్‌డేట్ తప్పనిసరి – రాష్ట్రాలకు UIDAI లేఖ

భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు లేఖ రాసి పాఠశాల విద్యార్థుల ఆధార్ వివరాలను తక్షణమే అప్‌డేట్ చేయాలని ఆదేశించింది.

బయోమెట్రిక్ అప్‌డేట్ తప్పనిసరి – ఒకసారి 5-7 ఏళ్లలో, మరొకసారి 15-17 ఏళ్లలో చేయాలి.

  •  ఉచిత సేవ – ఈ రెండు సార్లు ఆధార్ అప్‌డేట్ పూర్తిగా ఉచితం.
  •  స్కూళ్లలో ప్రత్యేక క్యాంపులు – ఆధార్ అప్‌డేట్ కోసం పాఠశాలల్లోనే ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేయాలని సూచన.
  •  హెచ్చరిక – ఆధార్ సరిగా లేకపోతే విద్యార్థులు NEET, JEE, CUET వంటి జాతీయ ప్రవేశ పరీక్షల్లో, అలాగే ప్రభుత్వ పథకాలలో ఇబ్బందులు ఎదుర్కొనే ప్రమాదం.

UIDAI చీఫ్ భువనేశ్ కుమార్ రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులకు లేఖ రాసి, సమయానుసారంగా ఆధార్ అప్‌డేట్ చేయడం విద్యార్థుల భవిష్యత్తుకు అత్యంత కీలకమని స్పష్టం చేశారు.


Today's Best Deals

Rs. 270.00

Emoji Expressions Matching Game

Rs. 480.00

Labubu Bunny Keychain

Rs. 100.00

Face Changing Keychain

Rs. 230.00

Busy Book