ఫ్యాన్సీ నంబర్ల ధరలకు పెంపు – తెలంగాణ రవాణా శాఖ కొత్త నిర్ణయం
తమ వాహనానికి ఫ్యాన్సీ నంబర్ కావాలని కోరుకునే వాహనదారులకు తెలంగాణ రవాణాశాఖ షాక్ ఇచ్చింది. ఫ్యాన్సీ నంబర్ల ప్రాథమిక ధరలను భారీగా పెంచుతూ నిర్ణయం తీసుకుంది.
ఇప్పటి వరకు రూ. 50 వేలు మాత్రమే ఉన్న 9999 నంబర్ ధరను రూ. 1.50 లక్షలకు పెంచారు. అదేవిధంగా, 6666 నంబర్ ధర రూ. 30 వేల నుంచి రూ. 1 లక్షకు పెరిగింది. ఇకపై ఈ నంబర్లు వేలం ద్వారా ఎక్కువ ధర చెప్పిన వారికి కేటాయించబడతాయి.
ఇప్పటివరకు ఉన్న 5 స్లాబులను 7 స్లాబులుగా మార్చిన రవాణాశాఖ, కొత్తగా ఈ విధంగా ధరలు నిర్ణయించింది:
-
రూ. 1.50 లక్షలు
-
రూ. 1 లక్ష
-
రూ. 50 వేల రూపాయలు
-
రూ. 40 వేల రూపాయలు
-
రూ. 30 వేల రూపాయలు
-
రూ. 20 వేల రూపాయలు
-
రూ. 6 వేల రూపాయలు
ఈ మార్పులతో రవాణా శాఖకు సంవత్సరానికి రూ. 100 కోట్లకు పైగా అదనపు ఆదాయం వచ్చే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ప్రజల నుంచి అభ్యంతరాలు, సూచనలు స్వీకరించిన తర్వాత పూర్తి నోటిఫికేషన్ విడుదల కానుంది.