తేజ సజ్జా: మిరాయ్ సినిమా టికెట్లపై ధరల పెంపు లేదు
హీరో తేజ సజ్జా నటించిన సైన్స్ ఫిక్షన్ ఎంటర్టైనర్ ‘మిరాయ్’ సినిమా ఈ నెల 12 సెప్టెంబర్న రిలీజ్ కాబోతోంది. విడుదలకు ముందే వైజాగ్ బీచ్ రోడ్డులో ఘనంగా ప్రీ-రిలీజ్ ఈవెంట్ నిర్వహించబడింది. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో రితిక నాయక్ హీరోయిన్‌గా, మనోజ్ విలన్ పాత్రలో కనిపించనున్నారు.
ఈ వేడుకలో హీరో తేజ సజ్జా మాట్లాడుతూ,
“మనం చాలా కష్టపడి, ప్రేమతో ఈ సినిమాను రూపొందించాం. ఎక్కువ మంది ప్రజలు ఈ సినిమాను చూడాలన్న ఉద్దేశంతో, టికెట్ ధరలను పెంచకూడదని నిర్ణయించాం. నిర్మాత టీజీ విశ్వ ప్రసాద్ మరియు డిస్ట్రిబ్యూటర్లతో చర్చించి, టికెట్లు సాధారణ ధరలలో అందుబాటులో ఉండేలా చూసాం. ఇది ఒక రిస్క్ అయినప్పటికీ, ప్రేక్షకులు మాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టడమే మా లక్ష్యం,” అని తెలిపారు.
అలాగే, యూఎస్ లో మిరాయ్ సినిమా టికెట్ల అమ్మకాలు ప్రారంభమైనట్లు తేజ పేర్కొన్నారు. విదేశాల్లో కూడా ఈ సినిమా మంచి స్పందన పొందుతుందని అంచనా వేస్తున్నారు.