యువ హీరో తేజ సజ్జా హీరోగా నటించిన సూపర్ అడ్వెంచర్ థ్రిల్లర్ 'మిరాయ్' బాక్సాఫీస్‌లో రికార్డులు కొల్లగొడుతోంది. విడుదలైన ఐదు రోజులలోనే సినిమా రూ.100 కోట్ల క్లబ్‌లో చేరింది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా ఐదు రోజుల్లో రూ.100 కోట్ల గ్రాస్ కలెక్షన్ సాధించినట్లు యూనిట్ తెలిపింది.
మిరాయ్ ప్రథమ రోజు రూ.27.20 కోట్లు, రెండవ రోజు రూ.55.60 కోట్లు వసూళ్లు రాబట్టింది. వారాంతంలో ఆదివారం రూ.16 కోట్లకు పైగా కలెక్షన్స్ నమోదు అయ్యాయి. బుధవారం వరకు గ్రాస్ కలెక్షన్ వంద కోట్లకు చేరిందని ట్రేడ్ వర్గాలు పేర్కొన్నాయి.
ఈ వారం థియేటర్లలో పెద్ద సినిమాలు లేకపోవడం వల్ల మిరాయ్ వసూళ్ల జోష్ కొనసాగే అవకాశం ఉంది. వచ్చే వారం పవన్ కల్యాణ్ 'ఓజీ' సినిమా రిలీజ్ కావడంతో కలెక్షన్లపై ప్రభావం పడే అవకాశం ఉంది. ఇప్పుడు మిగిలిన రోజుల్లో 'మిరాయ్' ఎంత వసూళ్లు రాబట్టుతుందో చూడాలి.