RRB NTPC 2025 పరీక్ష తేదీలు విడుదల – పూర్తి రైల్వే పరీక్ష షెడ్యూల్‌ తెలుసుకోండి!

RRB NTPC 2025 పరీక్ష తేదీలు విడుదల – 8,113 గ్రాడ్యుయేట్ ఉద్యోగాల కోసం షెడ్యూల్

గతేడాది రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (RRB) దేశవ్యాప్తంగా 11,558 నాన్-టెక్నికల్ పాపులర్ కేటగిరీ (NTPC) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ పోస్టులకు సుమారుగా 1.2 కోట్ల మంది అభ్యర్థులు దరఖాస్తు చేశారు. అప్పటినుంచి పరీక్ష తేదీల కోసం నిరుద్యోగులు వేచి చూస్తున్నారు.

ఇప్పుడు RRB తాజాగా 8,113 గ్రాడ్యుయేట్ స్థాయి పోస్టుల కోసం పరీక్ష తేదీలను ప్రకటించింది. పరీక్షలు జూన్ 5 నుండి జూన్ 23, 2025 వరకు దేశవ్యాప్తంగా అనేక కేంద్రాల్లో నిర్వహించనున్నారు. మిగిలిన 3,445 అండర్‌గ్రాడ్యుయేట్ పోస్టుల తేదీలు త్వరలో విడుదలవుతాయి.

గ్రాడ్యుయేట్ స్థాయి NTPC పోస్టులు:

  • చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్‌వైజర్ – 1,736 పోస్టులు

  • స్టేషన్ మాస్టర్ – 994 పోస్టులు

  • గూడ్స్ ట్రైన్ మేనేజర్ – 3,144 పోస్టులు

  • జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ – 1,507 పోస్టులు

  • సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ – 732 పోస్టులు

పరీక్ష వివరాలు:

  • పరీక్ష ఆన్‌లైన్ విధానంలో (CBT-1) నిర్వహించబడుతుంది.

  • రోజుకు మూడు షిఫ్టులు:

    • షిఫ్ట్ 1: ఉదయం 9:00 నుండి 10:30 వరకు

    • షిఫ్ట్ 2: మధ్యాహ్నం 12:45 నుండి 2:15 వరకు

    • షిఫ్ట్ 3: సాయంత్రం 4:30 నుండి 6:00 వరకు

  • వ్యవధి: 90 నిమిషాలు

  • ప్రశ్నలు: 100 మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలు

    • జనరల్ అవేర్‌నెస్ – 40

    • మ్యాథమెటిక్స్ – 30

    • జనరల్ ఇంటెలిజెన్స్ & రీజనింగ్ – 30

  • నెగటివ్ మార్కింగ్ ఉంటుంది – ప్రతి తప్పు సమాధానానికి 1/3 మార్కు తగ్గించబడుతుంది.


Today's Best Deals

Rs. 350.00

Piggy Bank

Rs. 650.00

Bullet Gun

Rs. 449.00

Camera Water Bottle

Rs. 150.00

Magic Sketch Pens