బైక్ టాక్సీ సేవలతో దేశవ్యాప్తంగా పేరుపొందిన ర్యాపిడో, ఇప్పుడు ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ రంగంలోకి అడుగుపెట్టింది. ఈ విస్తరణలో భాగంగా "ఓన్లీ" అనే కొత్త యాప్‌ను ప్రారంభించింది.
ప్రస్తుతం ఈ సేవలు బెంగళూరులోని కొన్ని ఎంపిక చేసిన ప్రాంతాల్లో అందుబాటులో ఉన్నాయి. వావ్, ఈట్ ఫిట్, క్రిస్పీ, క్రీం వంటి బ్రాండ్లతో ర్యాపిడో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ప్లాట్‌ఫామ్‌లో ఎక్కువగా ఆహార పదార్థాల ధరలు ₹150 లోపే ఉన్నాయి, కాబట్టి ఇది వినియోగదారులకు చవకైన ఆప్షన్ అవుతుంది.
భారత ఫుడ్ డెలివరీ మార్కెట్‌లో జొమాటో, స్విగ్గీ ఆధిపత్యం కొనసాగుతుండగా, ర్యాపిడో తక్కువ కమీషన్ (8–15%) వసూలు చేస్తూ పోటీ ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకుంది. 2015లో బైక్ ట్యాక్సీ సేవలతో ప్రారంభమైన ర్యాపిడో, ప్రస్తుతం 500కి పైగా నగరాల్లో రెండవ అతిపెద్ద రైడ్-షేరింగ్ ప్లాట్‌ఫామ్‌గా ఉంది. ఇప్పటికే బైక్ నెట్‌వర్క్ ద్వారా వ్యక్తిగత రెస్టారెంట్ల ఆర్డర్లను డెలివరీ చేస్తోంది, ఈ కొత్త యాప్‌తో ఆ సేవలను మరింత విస్తరించనుంది.