OG మూవీ యూఎస్ సెన్సేషన్ – రిలీజ్‌కి ముందే రికార్డుల వర్షం

అమెరికాలో ఓజీ మూవీ రికార్డులు – ప్రీమియర్స్‌కి ఐదు లక్షల డాలర్ల ప్రీ సేల్స్!

పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్, దర్శకుడు సుజిత్ కాంబినేషన్‌లో తెరకెక్కిన ఓజీ సినిమా అమెరికాలో సంచలనం సృష్టిస్తోంది. ఈ మూవీ సెప్టెంబర్ 25, 2025న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవ్వగా, అమెరికాలో సెప్టెంబర్ 24న ఒక రోజు ముందుగానే ప్రీమియర్స్ ప్రదర్శించనున్నారు.

మేకర్స్ తెలిపిన ప్రకారం, ఈ సినిమా ప్రీమియర్స్‌కే ఐదు లక్షల డాలర్లకు (రూ. 4.15 కోట్లకు పైగా) ప్రీ సేల్స్ నమోదు కావడం విశేషం. ఈ విషయాన్ని వారు X (ట్విట్టర్) వేదికగా ప్రకటిస్తూ “క్షణక్షణమొక తల తెగి పడేలే” అన్న టైటిల్ సాంగ్ లిరిక్‌ను షేర్ చేశారు.

డీవీవీ దానయ్య ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో పవన్ సరసన ప్రియాంక మోహన్ కథానాయికగా నటిస్తున్నారు. బాలీవుడ్ హీరో ఇమ్రాన్ హష్మీ విలన్‌గా కనిపించగా, అర్జున్ దాస్, శ్రీయా రెడ్డి, నారా రోహిత్ నిశ్చితార్థి సిరి లేళ్ల వంటి వారు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సంగీతం తమన్ అందిస్తున్నారు.


Today's Best Deals

Rs. 270.00

Emoji Expressions Matching Game

Rs. 480.00

Labubu Bunny Keychain

Rs. 100.00

Face Changing Keychain

Rs. 230.00

Busy Book