నితిన్ హీరోగా, శ్రీరామ్ వేణు దర్శకత్వంలో రూపొందుతున్న భావోద్వేగ యాక్షన్ డ్రామా తమ్ముడు బీటీఎస్ వీడియోను మేకర్స్ రిలీజ్ చేశారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ తమ సోషల్ మీడియా ద్వారా ఈ వీడియోను పంచుకున్నారు.
ఈ బీటీఎస్ వీడియోలో షూటింగ్ సమయంలో జరిగిన భావోద్వేగ సన్నివేశాలు, యాక్షన్ సీన్స్, నటుల కష్టపడే దృశ్యాలు చూపించాయి. సినిమాలో నితిన్ తన చెల్లెలి కోసం పోరాడే అన్నగా కనిపించనున్నారు. లయ ఇందులో నితిన్ సిస్టర్ గా నటిస్తున్నారు – ఆమె ఈ సినిమాతో మళ్లీ వెండితెరకు రాబోతున్నారు.
అంబరగొడుగు అనే ఊరిలో కథ సాగుతుంది. అక్కడ ప్రవేశించగలిగితే బయటకు రావడం కష్టమే. టీజర్‌లో నితిన్ ఒక శిక్షణ పొందిన విలుదారుడిగా కనిపించగా, ట్రైలర్‌లో అతని చెల్లెలు మరియు ఆమె బిడ్డ కష్టాల్లో చిక్కుకుపోయారని చూపించారు. నితిన్ చేసిన మాటను నిలబెట్టుకునే కథ ఇది. జూలై 4న ఈ సినిమా విడుదల కానుంది.