నీతా అంబానీ బల్కంపేట ఎల్లమ్మ ఆలయానికి కోటి రూపాయల విరాళం

బుధవారం ఆలయ బ్యాంక్ ఖాతాలో జమ అయిన విరాళం మొత్తం

హైదరాబాద్‌లో ప్రసిద్ధి చెందిన బల్కంపేట ఎల్లమ్మ, పోచమ్మ దేవస్థానానికి రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీ భార్య నీతా అంబానీ కోటి రూపాయల భారీ విరాళం అందజేశారు. ఈ విరాళం బుధవారం ఆలయ బ్యాంక్ ఖాతాలో జమైంది.

ఈ ఏడాది ఏప్రిల్ 23న నీతా అంబానీ తల్లి పూర్ణిమ దలాల్, సోదరి మమతా దలాల్ బల్కంపేట ఆలయాన్ని సందర్శించి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేశారు. ఆ సమయంలో అప్పటి ఆలయ కార్యనిర్వహణాధికారి (ఈఓ) కృష్ణ ఆలయ ప్రాముఖ్యత, విశేషాలను వివరించి, అభివృద్ధి కార్యక్రమాలకు సహకరించాలని అభ్యర్థించారు.

ఆ అభ్యర్థనకు సానుకూలంగా స్పందించి, నీతా అంబానీ రూ. కోటి విరాళాన్ని అందించారు. ఈ విరాళం మొత్తం బ్యాంకులో ఫిక్స్‌డ్ డిపాజిట్‌ చేయబడుతుంది. అందులో నుంచి వచ్చే వడ్డీతో ఆలయంలో ప్రతిరోజూ నిత్యాన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తామని ప్రస్తుత ఇన్‌ఛార్జి ఈఓ మహేందర్ గౌడ్ తెలిపారు.

ఈ నిధులు భక్తులకు నిరంతరాయంగా అన్నదానం చేయడంలో ఎంతో ఉపయోగపడతాయని ఆయన పేర్కొన్నారు.


Today's Best Deals

Rs. 270.00

Emoji Expressions Matching Game

Rs. 480.00

Labubu Bunny Keychain

Rs. 100.00

Face Changing Keychain

Rs. 230.00

Busy Book