NIFTEE 2025 షెడ్యూల్: ఎన్‌ఐఎఫ్‌టీఈఈ-2025 ఇంటర్వ్యూ తేదీలు విడుదల – పూర్తి షెడ్యూల్ ఇది
ఎన్‌ఐఎఫ్‌టీఈఈ-2025 స్టేజ్ 2 ఎంట్రన్స్ పరీక్ష ఇటీవల జరిగింది. ఈ పరీక్ష అనంతరం జరిగే ఇంటర్వ్యూలకు సంబంధించిన తేదీలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) విడుదల చేసింది. ఇంటర్వ్యూ కాల్ లెటర్లు అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయి. అభ్యర్థులు తమ అప్లికేషన్ నంబర్, పుట్టిన తేది వివరాలు నమోదు చేసి ఇంటర్వ్యూ కాల్ లెటర్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
షెడ్యూల్ ప్రకారం, మే 26, 27, 28, 29, 30, జూన్ 2, 3 తేదీల్లో NTA ఇంటర్వ్యూలు జరుగనున్నాయి. ఈ ర్యాంకుల ఆధారంగా యూజీ, పీజీ, పీహెచ్‌డీ లో వివిధ ఫ్యాషన్ టెక్నాలజీ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు.
ఏపీ ఇంటర్ సప్లిమెంటరీ 2025 మూల్యాంకనము ప్రారంభం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా మే 12 నుంచి మే 20 వరకు రెండు సెషన్లలో సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించబడ్డాయి. మే 21 నుండి జవాబు పత్రాల మూల్యాంకనం మొదలైంది. అధికారులు అన్ని నియమిత అధ్యాపకులు తప్పకుండా హాజరై మూల్యాంకనం చేయాలని హెచ్చరించారు. హాజరుకాని వారిపై నోటీసులు జారీ చేయబడతాయి.
ఇవి కూడా చదవండి
-
ఒక్కగానొక్క కూతురు.. తండ్రి కళ్ల ముందే ప్రాణం పోయిన దుఃఖం
-
తండ్రి కొడుకులు ఇంటర్ ఒకేసారి పాసైన సంచలనమా?
-
తాతకు మళ్లీ పెళ్లి.. కుటుంబంలో సీన్స్ సితార్
-
రష్యా-ఉక్రెయిన్ కాల్పుల విరమణకు అంగీకారం.. ఇలా జరిగింది
ఆల్ ఇండియా సైనిక్ స్కూల్ 2025 ఫలితాలు విడుదల
ఆల్ ఇండియా సైనిక్ స్కూల్స్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (AISSEE)-2025 ఫలితాలను NTA తాజాగా విడుదల చేసింది. ఫలితాలు అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయి. అభ్యర్థులు అప్లికేషన్ నంబర్, పుట్టిన తేది నమోదు చేసి ఫలితాలను చూసుకోవచ్చు. ఏప్రిల్ 5న జరిగిన ఓఎంఆర్ ఆధారిత పరీక్ష ద్వారా 2025-26 విద్యా సంవత్సరానికి 6, 9 తరగతుల ప్రవేశాలు కల్పించబడతాయి.