మణిక విశ్వకర్మ ‘మిస్ యూనివర్స్ ఇండియా 2025’ విజేతగా ఎంపిక

జైపూర్‌లో ఘనంగా జరిగిన పోటీల్లో మిస్ యూనివర్స్ ఇండియా 2025 విజేతగా మణిక విశ్వకర్మ

ప్రతిష్టాత్మక మిస్ యూనివర్స్ ఇండియా 2025 కిరీటం రాజస్థాన్‌కు చెందిన మణిక విశ్వకర్మను వరించింది. సోమవారం రాత్రి జైపూర్‌లో జరిగిన గ్రాండ్ ఫినాలేలో గత ఏడాది విజేత రియా సింఘా ఆమెకు కిరీటాన్ని అలంకరించారు. ఈ విజయంతో మణిక రాబోయే నవంబర్‌లో థాయ్‌లాండ్‌లో జరగనున్న 74వ మిస్ యూనివర్స్ పోటీల్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించనున్నారు.

ఈ పోటీలో ఉత్తరప్రదేశ్‌కు చెందిన తాన్యా శర్మ ఫస్ట్ రన్నరప్‌గా, హర్యానాకు చెందిన మెహక్ ధింగ్రా సెకండ్ రన్నరప్‌గా, అమిషి కౌశిక్ థర్డ్ రన్నరప్‌గా నిలిచారు.

బహుముఖ ప్రజ్ఞాశాలి మణిక

రాజస్థాన్‌లోని శ్రీ గంగానగర్కు చెందిన మణిక ప్రస్తుతం ఢిల్లీలో ఉంటూ, పొలిటికల్ సైన్స్, ఎకనామిక్స్‌లో చివరి సంవత్సరం చదువుతోంది. చిన్న వయసులోనే ఆమె శాస్త్రీయ నృత్యం, చిత్రలేఖనంలో ప్రతిభ కనబరిచింది. విదేశాంగ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో జరిగిన **‘బిమ్‌స్టెక్ సెవోకాన్’**లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించారు. లలిత కళా అకాడమీ, జేజే స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ నుంచి గౌరవాలు అందుకున్నారు.

కేవలం కళలకే పరిమితం కాకుండా, సామాజిక రంగంలో కూడా మణిక చురుకైన పాత్ర పోషిస్తోంది. న్యూరోడైవర్జెన్స్పై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు “న్యూరోనోవా” అనే సంస్థను స్థాపించింది. ఏడీహెచ్‌డీ వంటి సమస్యలను లోపాలుగా కాకుండా ప్రత్యేక మేధస్సులుగా చూడాలని తన ప్లాట్‌ఫాం ద్వారా ప్రచారం చేస్తున్నారు.

విజయానంతరం మణిక స్పందన

“నా ప్రయాణం నా ఊరు గంగానగర్‌ నుంచి మొదలైంది. ఢిల్లీలోకి వచ్చి ఈ పోటీల కోసం సిద్ధమయ్యాను. ఆత్మవిశ్వాసం, ధైర్యం మనల్ని ముందుకు తీసుకెళ్తాయి. నా వెనుక ఉన్న ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. ఈ పోటీలు కేవలం ఒక రంగం మాత్రమే కాదు, అవి వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దే ప్రపంచం” అని మణిక విశ్వకర్మ తన ఆనందాన్ని వ్యక్తం చేశారు.


Today's Best Deals

Rs. 270.00

Emoji Expressions Matching Game

Rs. 480.00

Labubu Bunny Keychain

Rs. 100.00

Face Changing Keychain

Rs. 230.00

Busy Book